Telugu Global
Sports

ప్రసిధ్ కృష్ణను ఎంపిక చేయడంపై స్పందించిన కోచ్ రాహుల్ ద్రావిడ్

భారత పేస్ త్రయం బుమ్రా, షమి, సిరాజ్ వన్డే వరల్డ్ కప్‌లో అదరగొడుతున్నారు.

ప్రసిధ్ కృష్ణను ఎంపిక చేయడంపై స్పందించిన కోచ్ రాహుల్ ద్రావిడ్
X

వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా తప్పుకోవడంతో టీమ్ ఇండియాకు గట్టి షాకే తగిలింది. అయితే అతని స్థానంలో యువ పేసర్ ప్రసిధ్ కృష్ణను ఎంపిక చేయడంపై అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఆల్ రౌండర్ ప్లేస్‌ను పేసర్ ఎలా భర్తీ చేస్తాడని ప్రశ్నిస్తున్నారు. వన్డేల్లో పెద్దగా అనుభవం లేని పేసర్‌ను ఎంపిక చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో టీమ్ ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ వివరణ ఇచ్చారు.

టీమ్ ఇండియా పేస్ బౌలింగ్ వనరులను పెంచేందుకే ప్రసిధ్ కృష్ణను తీసుకున్నామని చెప్పారు. అతడు పేసర్లకు బ్యాకప్‌గా ఉంటాడని చెప్పారు. 15 మందితో కూడిన జట్టులో ఇప్పటికే అశ్విన్ రూపంలో స్పిన్ బ్యాకప్ ఉంది. అలాగే ఆల్‌రౌండర్ బ్యాకప్‌గా శార్దుల్ ఠాకూర్ ఉన్నారు. కానీ ఫాస్ట్ బౌలర్లకు బ్యాకప్ లేకుండా పోయింది. ఎవరైనా అనారోగ్యం బారీన పడినా, గాయపడినే వేరే పేసర్ లేడు. అందుకే ప్రసిధ్ కృష్ణను ఎంపిక చేశామని రాహుల్ ద్రవిడ్ వివరించారు. ఇది ఇతర కాంబినేషన్లలో ఆడేందుకు కూడా ఉపయోగపడుతుందని చెప్పాడు.

కాగా, భారత పేస్ త్రయం బుమ్రా, షమి, సిరాజ్ వన్డే వరల్డ్ కప్‌లో అదరగొడుతున్నారు. వీరి ముగ్గురిలో ఎవరైనా ఒకరికి గాయం అయితే తప్ప ప్రసిధ్‌కు తుది జట్టులో చోటు దక్కకపోవచ్చు. భారత జట్టు ఆదివారం పటిష్టమైన సౌతాఫ్రికా జట్టుతో లీగ్ మ్యాచ్ ఆడనున్నది. ఇప్పటికే సెమీస్ చేరిన జట్ల మధ్య రసవత్తరమైన పోరు కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ భారత్‌కే కాకుండా సౌతాఫ్రికాకు కూడా పరీక్ష పెట్టనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

First Published:  5 Nov 2023 12:09 PM IST
Next Story