Telugu Global
Sports

2023 వన్డే ప్రపంచకప్ కు బుమ్రా రెడీ!

భారత క్రికెట్ యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా పూర్తి ఫిట్ నెస్ తో వన్డే ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టుకు అందుబాటులో ఉంటాడని జాతీయ క్రికెట్ అకాడమీలోని వైద్యబృందం ప్రకటించింది.

2023 వన్డే ప్రపంచకప్ కు బుమ్రా రెడీ!
X

2023 వన్డే ప్రపంచకప్ కు బుమ్రా రెడీ!

భారత క్రికెట్ యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా పూర్తి ఫిట్ నెస్ తో వన్డే ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టుకు అందుబాటులో ఉంటాడని జాతీయ క్రికెట్ అకాడమీలోని వైద్యబృందం ప్రకటించింది.....

జస్ ప్రీత్ బుమ్రా..గత కొద్ది సంవత్సరాలుగా భారత బౌలింగ్ కు వెన్నెముకగా ఉన్న ఈ యార్కర్ల మొనగాడు వెన్నెముకగాయంతో కొద్దిమాసాలుగా క్రికెట్ కు దూరమయ్యాడు.

గత జనవరిలో వెన్నముక గాయానికి శస్త్రచికిత్స చేయించుకొన్న 29 సంవత్సరాల బుమ్రా పూర్తిస్థాయిలో కోలుకోటానికి చాలా సమయమే పట్టింది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ వైద్యనిపుణుల పర్యవేక్షణలో పునరావాస కార్యక్రమాన్ని పూర్తి చేయడం ద్వారా బుమ్రా పూర్వపు ఫిట్ నెస్ ను సాధించగలిగాడు.

ఆగస్టు నెలలో ఐర్లాండ్ తో జరిగే మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ కు బుమ్రా అందుబాటులోకి రానున్నాడు. ఆ తర్వాత భారత్ వేదికగా అక్టోబర్ లో ప్రారంభమయ్యే ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో సైతం బుమ్రా పాల్గోనున్నాడు.

ఒక్కగాయంతో ఆగమాగం...

క్రికెటర్లు..ప్రధానంగా తురుపుముక్కలాంటి బౌలర్లకు ఒక్కగాయమైతే చాలు..వ్యక్తిగతంగాను, జట్టు పరంగాను ఎంత ఆగమాగమైపోతాము అన్నదానికి నిదర్శనమే జస్ ప్రీత్ బుమ్రా.

క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ భారత ప్రధాన అస్త్త్రంగా ఉన్నమెరుపు ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా కెరియర్ గందరగోళంగా మారింది. వెన్నెముక గాయం బుమ్రా భవితవ్యాన్న

అయోమయంలో పడేసింది.

అంతర్జాతీయ క్రికెట్లో భారత్, ఐపీఎల్ ముంబై ఫ్రాంచైజీ కీలక బౌలర్ గా ఉన్న బుమ్రా గతేడాది జరిగిన టీ-20 ప్రపంచకప్ తో పాటు ఐపీఎల్ -16తో పాటు ..ఇటీవలే ముగిసిన టెస్టు లీగ్ ఫైనల్ కు సైతం దూరమయ్యాడు. దీంతో భారత బౌలింగ్ ఎటాక్ కోరలు తీసినపాములా తయారయ్యింది.

బుమ్రా లేని లోటు అంతాఇంతాకాదు...

ప్రపంచక్రికెట్లో జస్ ప్రీత్ బుమ్రా కు నాణ్యమైన, మ్యాచ్ ను మలుపు తిప్పగల పేస్ బౌలర్ గా పేరుంది. సాంప్రదాయ టెస్టు క్రికెట్, వన్డే క్రికెట్, ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్...ఫార్మాట్ ఏదైనా ఒకేతీరుగా రాణించడం, ప్రభావశీలమైన ఫాస్ట్ బౌలర్ గా బుమ్రాకు తిరుగులేని రికార్డే ఉంది. యార్కర్లు సంధించడంలో బుమ్రా తర్వాతే ఎవరైనా.

అయితే..గత మూడేళ్లుగా బుమ్రా ఎడాపెడా క్రికెట్ మ్యాచ్ లు ఆడేస్తూ తరచూ గాయాలకు గురికావడం భారతజట్టు విజయావకాశాలను దెబ్బతీస్తూ వచ్చింది. కీలక సిరీస్ లు, టోర్నీల సమయంలో బుమ్రా భారతజట్టుకు అందుబాటులో లేకుండా పోడంతో భారత్ భారీమూల్యమే చెల్లించాల్సి వచ్చింది.

న్యూజిలాండ్ లో ఆపరేషన్....

ముంబై ఫ్రాంచైజీ ఫాస్ట్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ సలహాలు, సూచనల మేరకే బుమ్రాకు న్యూజిలాండ్ ప్రముఖ వైద్యునితో శస్త్రచికిత్స చేయించారు.

అక్లాండ్‌లో ప్రముఖ వైద్యుడిగా పేరున్న రోవ‌న్ గ‌తంలో న్యూజిలాండ్ ఆట‌గాళ్లకు సైతం చికిత్సి అందించడం ద్వారా సత్వరమే కోలుకొనేలా చేశారు. ప్ర‌స్తుతం ముంబై ఇండియ‌న్స్ ఫ్రాంఛైజీకి బౌలింగ్ కోచ్‌గా షేన్‌బాండ్‌ సైతం గతంలో చికిత్స తీసుకొన్నాడు.బీసీసీఐ వైద్య బృందం, జాతీయ క్రికెట్ అకాడ‌మీ కలసి ఏర్పాట్లు చేశాయి. స‌ర్జ‌రీ అనంతరం బుమ్రా కోలుకునేందుకు 20 వారాలపాటు ఆటకు దూరం కావాల్సి వచ్చింది.

2022 సెప్టెంబర్లో చివరిసారిగా..

గత ఏడాది సెప్టెంబ‌ర్‌లో బుమ్రా చివరిసారిగా మైదానంలోకి దిగాడు. వెన్నెముక భాగంలో నొప్పితో బాధ‌ప‌డుతున్న బుమ్రాకు ఎన్‌సీఏలో స్కాన్ తీయిస్తే స‌మ‌స్య తీవ్రంగా ఉంద‌ని తెలిసింది. దాంతో, టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సైతం ఆడ‌లేదు. అయితే.. శ్రీ‌లంక వ‌న్డే సిరీస్‌కు బుమ్రాను ఎంపిక చేసిన బీసీసీఐ వెంట‌నే పక్కన పెట్టింది. అత‌ను పూర్తిగా కోలుకునేందుకు మ‌రింత స‌మ‌యం ఇవ్వాల‌నుకుంది. అయితే.. బోర్డ‌ర్ – గ‌వాస్క‌ర్ ట్రోఫీ వ‌ర‌కైనా అత‌ను ఫిట్‌నెస్ సాధిస్తాడ‌ని అంతా అనుకున్నారు. కానీ, బుమ్రాకు ఎన్‌సీఏ నుంచి ఫిట్ నెస్ సర్టిఫికెట్ దక్కలేదు.

బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు ద్వారా ఏడాదికి 7 కోట్ల రూపాయలు అందుకొంటున్న బుమ్రా..ఐపీఎల్ కాంట్రాక్టుపై ముంబై ఫ్రాంచైజీ నుంచి సీజన్ కు 7 కోట్ల రూపాయల చొప్పున ఆర్జిస్తున్నాడు.

29 సంవత్సరాల బుమ్రా భారత్ తరపున 72 వన్డేలు, 60 టీ-20 మ్యాచ్ లు, 30కి పైగా టెస్టులు , ఐపీఎల్ లో ముంబై తరపున 120 మ్యాచ్ లు ఆడిన రికార్డు ఉంది.

ఐపీఎల్ లో 20221 సీజన్ వరకూ 145 వికెట్లు పడగొ్ట్టాడు. టెస్టుల్లో 128 వికెట్లు, వన్డేలలో 121 వికెట్లు, టీ-20ల్లో 70 వికెట్లు పడగొట్టిన రికార్డు బుమ్రా కు ఉంది.

మరో నాలుగుమాసాలలో బుమ్రా పూర్తి ఫిట్ నెస్ తో భారతజట్టుకు అందుబాటులోకి రాగలిగితే..భారత పేస్ బౌలింగ్ కు వెయ్యేనుగుల బలం వచ్చినట్లే.

First Published:  18 Jun 2023 7:30 AM GMT
Next Story