నేడు వరల్డ్‌కప్‌లో బిగ్‌ఫైట్.. కివీస్ వర్సెస్ భారత్.!
రోహిత్, కోహ్లీ ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసిరానుంది. శుభ్‌మన్ కూడా తన మునుపటి ఫామ్‌ను అందుకున్నాడు. శ్రేయాస్, రాహుల్ కూడా అవకాశం వచ్చినప్పుడు సత్తా చాటుతున్నారు.
వరల్డ్‌కప్‌లో మరో బిగ్‌ఫైట్‌కు రెడీ అయింది టీమ్ ఇండియా. నేడు ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో తలపడనుంది టీమిండియా. ఇప్పటివరకూ ఈ మెగా టోర్నీలో ఈ రెండు జట్లు తామాడిన నాలుగు మ్యాచుల్లోనూ గెలిచాయి. దీంతో ఈ మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారింది. ఓవరాల్‌గా రికార్డులు చూసుకుంటే వరల్డ్‌కప్‌లో ఇండియాపై కివీస్‌దే పైచేయి. గడిచిన 20 ఏళ్లలో కివీస్‌పై భారత్ విజయం సాధించలేదు. టెస్టు ఛాంపియన్‌షిప్‌లోనూ ఇండియాపై తన అధిపత్యాన్ని ప్రదర్శించింది కివీస్.
ఈ రెండు జట్ల మధ్య ఇవాళ జరిగే మ్యాచ్ కోసం అభిమానులు ఇంట్రెస్టింగ్‌గా ఎదురుచూస్తున్నారు. ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లను ఓడించి జోరు మీదున్న ఇండియాకు కివీస్‌తో మ్యాచ్ సవాల్ లాంటిందే. టోర్నీ ప్రారంభానికి ముందు న్యూజిలాండ్‌పై పెద్దగా అంచనాలు లేనప్పటికీ.. టోర్నీ ప్రారంభమయ్యాక కివీస్ దూకుడుగా ఆడుతోంది. ఇక పేసర్లకు అనుకూలించే ధర్మశాలలో ఈ మ్యాచ్ జరగనుంది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా మ్యాచ్‌కు దూరం కావడం భారత్‌కు మైనస్.
రోహిత్, కోహ్లీ ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసిరానుంది. శుభ్‌మన్ కూడా తన మునుపటి ఫామ్‌ను అందుకున్నాడు. శ్రేయాస్, రాహుల్ కూడా అవకాశం వచ్చినప్పుడు సత్తా చాటుతున్నారు. అయితే కివీస్ పేస్, స్పిన్ బౌలింగ్ విభాగం బలంగా ఉంది. పేసర్లకు పిచ్ సహకరిస్తే భారత బ్యాటర్లకు ఇబ్బంది తప్పకపోవచ్చు. ఇక భారత బౌలింగ్‌లో బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజాలు రాణిస్తున్నారు. ఈ మ్యాచ్‌లోనూ అదే నిలకడను టీమ్ ఆశిస్తోంది.
2019 ప్రపంచకప్ సెమీస్‌లో భారత్‌కు షాకింగ్ ఓటమిని రుచిచూపింది కివీస్. దీంతో ఆనాటి ఓటమికి ఇవాళ ప్రతీకారం తీర్చుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉన్న కివీస్‌ను ఓడించడం అంత ఈజీ కాదు.