వరల్డ్ కప్‌కి వికెట్ కీపర్ కేఎల్ రాహులే! తేల్చేసిన బీసీసీఐ
15 మందితో ప్రకటించిన జట్టులో ఇషాన్ కిషన్ కూడా ఉన్నాడు. అయితే రాహుల్‌కి స్టాండ్‌బైగానే ఇషాన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
కేఎల్ రాహుల్ అపార ప్రతిభావంతుడైన ఆటగాడు.. కానీ ఏనాడూ అవసరమైన మ్యాచ్‌ల్లో దాన్ని వాడినట్టు కనిపించడు. అందుకే ఎంత టాలెంట్ ఉన్నా అతన్ని టీంలోకి తీసుకుంటే విమర్శలు వెల్లువెత్తుతుంటాయి. గాయాలతో కొన్నాళ్లుగా జట్టులోకి వచ్చిపోతున్న నేపథ్యంలో త్వరలోనే స్వదేశంలో జరగబోయే ప్రపంచకప్‌కు అతని ఎంపిక గురించి బోల్డన్ని సందేహాలు తలెత్తాయి. కానీ బీసీసీఐ అతనిపై నమ్మకం ఉంచి వరల్డ్‌కప్‌కు అతన్నే వికెట్ కీపర్‌గా ఎంపిక చేసింది. 15 మందితో ప్రకటించిన జట్టులో ఇషాన్ కిషన్ కూడా ఉన్నాడు. అయితే రాహుల్‌కి స్టాండ్‌బైగానే ఇషాన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ప్రతిభావంతుడే
ఇప్పటి వరకు 54 వన్డేలాడిన కేఎల్ రాహుల్ 1986 పరుగులు సాధించాడు. యావరేజ్ 45.13. స్ట్రైక్ రేట్ 86.57. ఇందులో 5 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఏ రకంగా చూసినా ఇవి టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ స్థాయి గణాంకాలు. వికెట్ కీపర్‌గానూ 32 క్యాచ్‌లు, 2 స్టంపింగ్‌లతో బానే ఉన్నాడు. సంజు శాంసన్‌కి అవకాశాలిచ్చినా ఉపయోగించుకోలేకపోవడం, సంజు, ఇషాన్ కిషన్ కూడా కేఎల్ రాహుల్ అంత భారీ స్థాయి బ్యాట్స్‌మన్లు కాకపోవడం అతనికి కలిసొచ్చింది.
సమస్యేంటి?
కేఎల్ రాహుల్ ప్రతిభకు వంక పెట్టడానికేమీ లేదు. కానీ నిలకడగా ఆడలేకపోవడం, ఫిట్‌నెస్ సమస్యలు, గాయాల బెడద అతణ్ని టీమ్‌లో కుదురుకోనివ్వడం లేదు. అందుకే మంచి రికార్డున్నా అతను ఇప్పటివరకూ అభిమానుల దృష్టిలో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడినట్లు గుర్తు కూడా లేదు. ఈ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయంగా సంజూ శాంసన్‌కు అవకాశాలిచ్చినా అతను వినియోగించుకోలేదు. ఇషాన్‌తో పోల్చినా కేఎల్ రాహుల్ బెస్ట్ అన్న ఉద్దేశంతో టీమిండియా అతనికి అవకాశమిచ్చింది. ప్రపంచకప్‌లో అతను ఎంత ఉపయోగపడతాడన్నది అతను ఆడే రోజు వరకూ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ సహా ఎవరూ చెప్పలేరు.