Telugu Global
Sports

తొలి వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా

మహమ్మద్ షమీ బౌలింగ్‌లో కీపర్‌ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చిన కూపర్‌ ఓటయ్యాడు.

తొలి వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా
X

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీలో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ప్రారంభంలో ఓపెనర్ కూపర్ వికెట్ కోల్పోయింది. మహమ్మద్ షమీ బౌలింగ్‌లో కీపర్‌ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చిన కూపర్‌ ఓటయ్యాడు. క్రీజులోకి వచ్చిన స్టీవ్‌ స్మిత్‌ వచ్చాడు. 3 ఓవర్లకు ఆసీస్‌ స్కోర్‌ 4/1 ఉంది. ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచే టీమ్‌ ఫైనల్‌కు చేరుకుంటుంది. అయితే, మెగా టోర్నీల్లో దూకుడుగా ఆడే ఆసీస్‌ను ఓడించడం తేలికేం కాదనేది క్రికెట్ విశ్లేషకుల అంచనా. అలాగే భారత్‌ అంటే చెలరేగిపోయే ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్‌ హెడ్‌ను కట్టడి చేస్తే సగం విజయం సాధించినట్లేనని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. అందుకోసం ఎవరైనా సరే త్వరగా అతడిని పెవిలియన్‌కు చేర్చాలని సూచించాడు.

వ‌న్డేల్లో వ‌రుస‌గా అత్య‌ధిక మ్యాచ్‌ల‌లో(14) టాస్ ఓడిన జ‌ట్టుగా భార‌త్ పేరిట అవాంఛిత రికార్డు కొనసాగుతోంది. ఛాంపియ‌న్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో టాస్ ఓడ‌టంతో ఈ రికార్డు మరింత పెరిగింది. భార‌త జ‌ట్టు 2023 న‌వంబ‌ర్ 19న జ‌రిగిన‌ వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 14 సార్లు టాస్ గెల‌వ‌లేక‌పోయింది. ఇదే ఏడాది డిసెంబ‌ర్ లో ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన మూడు వ‌న్డేల్లోనూ టీమిండియా టాస్ ఓడిపోయింది.

First Published:  4 March 2025 2:55 PM IST
Next Story