Telugu Global
Sports

భారత్ ఖాతాలో మరో 3స్వర్ణాలు!

19వ ఆసియాక్రీడల పోటీల ఐదోరోజున భారత్ మరో స్వర్ణం గెలుచుకోడం ద్వారా పతకాల పట్టిక 5వ స్థానంలో నిలిచింది.

భారత్ ఖాతాలో మరో 3స్వర్ణాలు!
X

భారత్ ఖాతాలో మరో 3స్వర్ణాలు!

19వ ఆసియాక్రీడల పోటీల ఐదోరోజున భారత్ మరో స్వర్ణం గెలుచుకోడం ద్వారా పతకాల పట్టిక 5వ స్థానంలో నిలిచింది.

హాంగ్జు వేదికగా జరుగుతున్న ఆసియాక్రీడల షూటింగ్ లో భారత షూటర్ల బంగారు వేట కొనసాగుతోంది. పోటీల నాలుగోరోజున మహిళా షూటర్లు రెండు స్వర్ణాలు సాధిస్తే..

ఐదోరోజు పోటీలలో పురుషులజట్టు మరో బంగారు పతకాన్ని అందించింది.

10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో గోల్డ్...

పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగంలో భారత్ బంగారు పతకం గెలుచుకొంది. సరబ్జోత్ సింగ్, అర్జున్ సింగ్ చీమ, శివ నర్వాల్ లతో కూడిన భారతజట్టు స్వల్పతేడాతో చైనాను అధిగమించడం ద్వారా స్వర్ణపతకాన్ని చేజిక్కించుకొంది. భారతజట్టు మొత్తం 1734 పాయింట్లతో విజేతగా నిలిస్తే..ఆతిథ్య చైనా 1730 పాయింట్లతో రజత పతకంతో సరిపెట్టుకొంది.

వ్యక్తిగత విభాగం ఫైనల్లో ఇద్దరు భారత షూటర్లు..

పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగం మెడల్ రౌండ్ కు భారత్ కు చెందిన సర్బజీత్ సింగ్, అర్జున్ సింగ్ అర్హత సంపాదించారు.

మరో రెండు బంగారు పతకాలు గెలుచుకొన్నారు. నాలుగోరోజు పోటీలు ముగిసే సమయానికి భారత్ 5 స్వర్ణాలతో సహా మొత్తం.

మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో స్వర్ణం..

మహిళల పిస్టల్ 25 మీటర్ల షూటింగ్ టీమ్ విభాగంలో మను బాకర్, రిథమ్ సంగ్వాన్, ఇషా సింగ్ లతో కూడిన భారతజట్టు బంగారు పతకం గెలుచుకొంది.

మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ వ్యక్తిగత విభాగంలో భారత్ కే చెందిన సిఫ్ట్ కౌర్ సమ్రా స్వర్ణ విజేతగా నిలిచింది.

కేవలం షూటింగ్ క్రీడలోనే భారత్ 4 స్వర్ణస 4 రజత, 5 కాంస్యాలతో సహా మొత్తం 13 పతకాలు సాధించింది.

మొత్తం 45 దేశాలకు చెందిన 12వేల మంది అథ్లెట్లు 40 రకాల క్రీడాంశాలలో 481 బంగారు పతకాల కోసం పోటీపడుతున్నారు. ఐదోరోజు పోటీల ప్రారంభం అంశం ముగిసే సమయానికి భారత్ పతకాల పట్టిక 5వ స్థానంలో కొనసాగుతోంది.

భారత్ మొత్తం 6 స్వర్ణాలు, 8 రజత, 14 కాంస్యాలతో సహా 24 పతకాలు సాధించింది. ఆతిథ్య చైనా, దక్షిణ కొరియా, జపాన్, ఉజ్బెకిస్థాన్ పతకాల పట్టిక మొదటి నాలుగుస్థానాలలో కొనసాగుతున్నాయి.

ఇండోనీసియాలోని పాలెమ్ బాంగ్ వేదికగా ముగిసిన 2018 ఆసియాక్రీడల్లో 16 స్వర్ణ, 23 రజత, 31 కాంస్యాలతో సహా 70 పతకాలు సాధించిన భారత్..ప్రస్తుత 2022 ఆసియాక్రీడల్లో 100 పతకాలు సాధించాలన్న లక్ష్యంతో 655 మంది అథ్లెట్లతో బరిలోకి దిగింది.

రానున్న 9 రోజుల పోటీలలో భారత్ మరెన్ని పతకాలు సాధించగలదన్నది ఆసక్తికరంగా మారింది.

First Published:  28 Sept 2023 5:30 AM GMT
Next Story