Telugu Global
Sports

ఆసియా కప్ షెడ్యూల్ విడుదల.. దాంట్లో ఉన్న కన్ఫ్యూజన్‌కు ఇదిగో క్లారిటీ

ఇండియా పాకిస్తాన్ మధ్య గ్రూప్ దశలో సెప్టెంబర్ 2న కాండీ వేదికగా మ్యాచ్ జరుగనున్నది. ఇక సూపర్ 4 దశకు వెళ్తే.. ఇండియా, పాకిస్తాన్ మధ్య సెప్టెంబర్ 10న కొలంబో వేదికగా మరో మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయి.

ఆసియా కప్ షెడ్యూల్ విడుదల.. దాంట్లో ఉన్న కన్ఫ్యూజన్‌కు ఇదిగో క్లారిటీ
X

ఆసియా కప్ 2023 వన్డే క్రికెట్ కప్ షెడ్యూల్ విడుదలైంది. హైబ్రీడ్ మోడల్‌లో పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా అగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆసియా కప్ నిర్వహించనున్నట్లు ఏషియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా ప్రకటించారు. ఆసియా కప్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్ ఏలో పాకిస్తాన్, ఇండియా, నేపాల్ జట్లు.. గ్రూప్ బిలో శ్రీలంక, ఆప్షనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. పాకిస్తాన్‌లోని లాహోర్, ముల్తాన్.. శ్రీలంకలోని కాండీ, కొలంబోలలో మొత్తం 13 మ్యాచ్‌లు జరుగుతాయి. ముల్తాన్‌లో ఒకటి, లాహోర్‌లో మూడు, కాండీలో మూడు, కొలంబోలో ఫైనల్ సహా 6 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

ఇండియా పాకిస్తాన్ మధ్య గ్రూప్ దశలో సెప్టెంబర్ 2న కాండీ వేదికగా మ్యాచ్ జరుగనున్నది. ఇక సూపర్ 4 దశకు వెళ్తే.. ఇండియా, పాకిస్తాన్ మధ్య సెప్టెంబర్ 10న కొలంబో వేదికగా మరో మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయి.

పూర్తి షెడ్యూల్ ఇదే..

అగస్టు 30 - పాకిస్తాన్ Vs నేపాల్ - ముల్తాన్

అగస్టు 31 - బంగ్లాదేశ్ Vs శ్రీలంక - కాండీ

సెప్టెంబర్ 2 - పాకిస్తాన్ Vs ఇండియా - కాండీ

సెప్టెంబర్ 3 - బంగ్లాదేశ్ Vs ఆఫ్ఘనిస్తాన్ - లాహోర్

సెప్టెంబర్ 4 - ఇండియా Vs నేపాల్ - కాండీ

సెప్టెంబర్ 5 - ఆఫ్ఘనిస్తాన్ Vs శ్రీలంక - లాహోర్

సూపర్ 4 మ్యాచ్‌లు..

సెప్టెంబర్ 6 - ఏ1 Vs బీ2 - లాహోర్

సెప్టెంబర్ 9 - బీ1 Vs బీ2 - కొలంబో

సెప్టెంబర్ 10 - ఏ1 Vs ఏ2 - కొలంబో

సెప్టెంబర్ 12 - ఏ2 Vs బీ1 - కొలంబో

సెప్టెంబర్ 14 - ఏ1 Vs బీ1 - కొలంబో

సెప్టెంబర్ 15 - ఏ2 Vs బీ2 - కొలంబో

సెప్టెంబర్ 17 - ఫైనల్ - కొలంబో

కన్ఫ్యూజర్‌కు ఇదే క్లారిటీ..

ఏసియా క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసిన షెడ్యూల్ చూసిన తర్వాత క్రికెట్ అభిమానులు కాస్త గందరగోళానికి గురయ్యారు. సూపర్ 4 దశలో ఏ1 Vs బీ2 మ్యాచ్ లాహోర్ వేదికగా జరుగుతుందని పేర్కొన్నారు. కాగా, గ్రూప్ ఏలో ఇండియా, పాకిస్తాన్, నేపాల్ దేశాలు ఉన్నాయి. ఒక వేళ గ్రూప్ దశలో ఇండియా ఏ1గా నిలిస్తే.. లాహోర్ వెళ్లి మ్యాచ్ ఆడుతుందా అనే అనుమానం ఏర్పడింది. భారత జట్టు పాకిస్తాన్ వెళ్లే అవకాశం లేకపోవడం వల్లే కదా ఆసియా కప్ 2023ని హైబ్రీడ్ మోడల్‌లో నిర్వహిస్తున్నారు. మరి గ్రూప్ 4లో ఏ1 Vs బీ2 మ్యాచ్ లాహోర్‌లో ఎందుకు ఏర్పాటు చేశారనే అనుమానం కలిగింది. దీనికి ఏసీసీ క్లారిటీ ఇచ్చింది.

గ్రూప్ దశలో ఎవరు టాప్ పాయింట్లు సాధించినా.. ఏ1గా పాకిస్తాన్, ఏ2గా ఇండియా ఉంటాయి. అలాగే బీ1గా శ్రీలంక, బీ2గా బంగ్లాదేశ్ జట్లు ఉంటాయి. అయితే ఈ నాలుగు జట్లలో ఏవైనా జట్లు సూపర్ 4కు అర్హత సాధించకపోతే వాటి స్థానంలో వేరు జట్టు వస్తుంది. నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ అర్హత సాధిస్తే.. గ్రూప్ దశలో అవి ఏ జట్టును అయితే ఓడించాయో.. దాని స్థానాన్ని తీసుకుంటాయి. నేపాల్ కనుక పాకిస్తాన్‌ను ఓడిస్తే ఏ1గా.. ఇండియాను ఓడిస్తే ఏ2గా సూపర్ 4కు వెళ్తుందని ఏసీసీ తెలిపింది.

First Published:  19 July 2023 8:32 PM IST
Next Story