Telugu Global
Sports

ఆసియాకప్ సూపర్ -4 రౌండ్లో టాప్- 4 జట్లు!

2020-ఆసియాకప్ వన్డే క్రికెట్ టోర్నీ సూపర్ -4 రౌండ్ కు లీగ్ దశలోని మొదటి నాలుగు అగ్రశ్రేణిజట్లు చేరుకొన్నాయి. సూపర్ -4 దశలో మొత్తం ఆరుమ్యాచ్ లు జరుగనున్నాయి.

ఆసియాకప్ సూపర్ -4 రౌండ్లో టాప్- 4 జట్లు!
X

ఆసియాకప్ సూపర్ -4 రౌండ్లో టాప్- 4 జట్లు!

2020-ఆసియాకప్ వన్డే క్రికెట్ టోర్నీ సూపర్ -4 రౌండ్ కు లీగ్ దశలోని మొదటి నాలుగు అగ్రశ్రేణిజట్లు చేరుకొన్నాయి. సూపర్ -4 దశలో మొత్తం ఆరుమ్యాచ్ లు జరుగనున్నాయి.

ఆసియాకప్ చరిత్రలోనే తొలిసారిగా హైబ్రిడ్ మోడల్ ( రెండుదేశాల ఆతిథ్యం)లో జరుగుతున్న 2023 వన్డే టోర్నీలో తొలిదశ 6 జట్ల లీగ్ కు తెరపడింది. నేపాల్, ఆప్ఘనిస్థాన్ జట్ల పోరు లీగ్ దశలోనే ముగియడంతో..గ్రూప్ - ఏ లీగ్ నుంచి టాప్ ర్యాంకర్ పాకిస్థాన్, 3వ ర్యాంకర్ భారత్, గ్రూప్- బీ లీగ్ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు..

సూపర్-4 రౌండ్ బెర్త్ లు ఖాయం చేసుకోగలిగాయి.

గ్రూప్ -బీ ఆఖరి రౌండ్ పోటీలో శ్రీలంక 2 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్థాన్ ను అధిగమించడంతో లీగ్ రౌండ్ మ్యాచ్ లు ముగిసినట్లయ్యింది.

గ్రూప్ - ఏ లీగ్ లో నేపాల్ ను ఓడించిన పాక్ జట్టు..భారత్ తో జరిగిన మ్యాచ్ వర్షంతో రద్దుకావడంతో 3 పాయింట్లతో లీగ్ టాపర్ గా సూపర్-4 రౌండ్ చేరింది.

నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో 10 వికెట్లతో నెగ్గిన భారత్..పాక్ తో మ్యాచ్ రద్దు కావడంతో 3 పాయింట్లు సాధించిన రెండోస్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది.

ఇక..గ్రూప్- బీ లీగ్ లో బంగ్లాదేశ్ ను 5 వికెట్లతోనూ, ఆప్ఘనిస్థాన్ ను 2 పరుగుల తేడాతోను ఓడించడం ద్వారా శ్రీలంక టాపర్ గా నిలిచింది.

ఆఫ్ఘనిస్థాన్ ను 89 పరుగులతో ఓడించడం ద్వారా బంగ్లాదేశ్ సూపర్ -4 రౌండ్ కు అర్హత సంపాదించింది.

ఆరుమ్యాచ్ లుగా సూపర్-4 రౌండ్...

పాకిస్థాన్, శ్రీలంక దేశాలలోని లాహోర్, కొలంబో వేదికలుగా ఆరుమ్యాచ్ ల సూపర్ -4 రౌండ్ ను సెప్టెంబర్ 15 వరకూ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 6న జరిగే సూపర్-4 తొలిమ్యాచ్ కు లాహోర్ వేదికగా ఉంటుంది. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ తో బంగ్లాదేశ్ ఢీ కొంటుంది.

సెప్టెంబర్ 9న కొలంబో వేదికగా జరిగే పోరులో శ్రీలంకతో బంగ్లాదేశ్ తలపడుతుంది. సెప్టెంబర్ 10న కొలంబో ప్రేమదాస స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.

సెప్టెంబర్ 12న కొలంబో వేదికగానే జరిగే పోరులో భారత్, శ్రీలంక అమీతుమీ తేల్చుకోనున్నాయి. సెప్టెంబర్ 14న కొలంబో వేదికగా శ్రీలంకతో పాకిస్థాన్ పోటీపడుతుంది.

సెప్టెంబర్ 15న కొలంబో వేదికగా భారత్, బంగ్లాజట్లు తలపడతాయి.

కొలంబో ప్రేమదాస స్టేడియం వేదికగా సెప్టెంబర్ 17న ఆసియాకప్ టైటిల్ సమరం జరుగనుంది.

కొలంబో మ్యాచ్ లకు వానముప్పులేనట్లే...

పల్లెకెలీ వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లకు వానదెబ్బతో తీవ్రఅంతరాయం ఏర్పడినా..కొలంబో వేదికగా జరిగే సూపర్-4 రౌండ్ మ్యాచ్ లకు వానముప్పు లేనట్లేనని శ్రీలంక వాతావరణ శాఖ తెలిపింది.

సెప్టెంబర్ 10న భారత్- పాకిస్థాన్ జట్ల నడుమ జరిగే సూపర్ సండే ఫైట్ కు ఏ విధమైన అంతరాయం ఉండబోదని, మ్యాచ్ మొత్తం 100 ఓవర్లూ జరగడం ఖాయమని తేల్చి చెప్పారు.

పల్లెకెలీ వేదికగా భారత్- పాక్ జట్ల నడుమ జరిగిన లీగ్ మ్యాచ్ వర్షం దెబ్బతో రద్దు కావడంతో రెండుజట్లూ చెరోపాయింటు పంచుకోవాల్సి వచ్చింది.

First Published:  6 Sept 2023 6:00 PM IST
Next Story