ఐసీసీ టీ 20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా అర్షదీప్ సింగ్
ప్రకటించిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్
ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డును టీమిండియా యంగ్ పేసర్ అర్షదీప్ సింగ్ దక్కించుకున్నాడు. ముగ్గురు క్రికెటర్లను వెనక్కినెట్టి అర్షదీప్ ఈ ఘనత సాధించాడు. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ శనివారం అధికారికంగా ప్రకటించింది. ఐసీసీ వన్‌డే ఇంటర్నేషనల్ జట్టులో టీమిండియా ప్లేయర్లకు చాన్స్ దక్కకున్నా, టీ20, టెస్టు టీముల్లో మనోళ్లు చోటు దక్కించుకున్నారు. ఐసీసీ టీ 20 టీమ్ కెప్టెన్ గా రోహిత్ శర్మను ఎంపిక చేశారు. రోహిత్ శర్మతో పాటు ఈ టీమ్‌లో ఇండియా నుంచి స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా, హార్థిక పాండ్యా, అర్షదీప్ సింగ్ కు చోటు దక్కింది.
ఐసీసీ టీ 20 మెన్స్ టీ20 ఇంటర్నేషనల్ టీమ్ ఆఫ్ ది ఇయర్ : రోహిత్ శర్మ (కెప్టెన్ : భారత్), ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా), ఫిల్ సాల్ట్ (ఇంగ్లాండ్), బాబర్ అజామ్ (పాకిస్తాన్), నికోలస్ పూరన్ (వికెట్ కీపర్ : వెస్టిండీస్), సికందర్ రజా (జింబాబ్వే), హార్దిక్ పాండ్యా (భారత్), రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్), వానిందు హసరంగ (శ్రీలంక), జస్ప్రీత్ బుమ్రా (భారత్), అర్ష్‌దీప్ సింగ్ (భారత్)
ఐసీసీ ఉమెన్స్ టీ20 ఇంటర్నేషనల్ టీమ్ ఆఫ్ ది ఇయర్ : టీ 20 మహిళల జట్టులో భారత్ నుంచి స్మృతి మంథన, వికెట్ కీపర్ రిచా ఘోష్, దీప్తీశర్మ చోటు దక్కించుకున్నారు. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ లారా వొల్వారాట్ ను కెప్టెన్‌గా ప్రకటించారు. ఈ జట్టులో భారత ప్లేయర్లు ముగ్గురితో పాటు చమరి ఆటపట్టు, హీలే మ్యాథ్యూస్, నాట్ స్కివర్ బ్రాట్, మిలే కర్, మరిజాన్నే కాప్, ప్రెండెగ్రాస్ట్, సదియ ఇక్బాల్ కు చోటు కల్పించారు.