ఘనంగా అఫ్ఘాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ వివాహం
కాబూల్‌లో జరిగిన వేడుకకు అఫ్ఘాన్ క్రికెటర్లంతా హాజరు
BY Raju Asari4 Oct 2024 9:19 AM IST
X
Raju Asari Updated On: 4 Oct 2024 9:19 AM IST
అఫ్ఘానిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. బుధవారం రాత్రి కాబుల్‌లో జరిగిన ఈ వేడుకకు పలువురు అఫ్ఘాన్ స్టార్ క్రికెటర్లు హాజరయ్యారు. రషీద్‌తో పాటు అతని ముగ్గురు సోదరుల పెళ్లిల్లు కూడా ఒకే సమయానికి జరిగినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బంధువుల ఒత్తిడి మేరకే రషీద్ పెళ్లి చేసుకున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఎందుకంటే అఫ్ఘానిస్థాన్ వరల్డ్ కప్ గెలిచిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. 2024 అఫ్ఘాన్ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచేలా ప్రపంచకప్ సెమీఫైనల్‌కు చేరుకున్న విషయం విదితమే.రషీద్ పెళ్లి జరిగిన హోటల్ బయట చాలామంది భద్రతా సిబ్బంది తుపాకులు పట్టుకుని తిరుగుతూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Next Story