Telugu Global
Sports

అడిలైడ్‌ టెస్ట్‌: డే 2 పూర్తి.. భారత్‌ 128/5

టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌ మాదిరిగానే తడబాటు..పంత్‌, నితీశ్‌పైనే ఆశలు

అడిలైడ్‌ టెస్ట్‌: డే 2 పూర్తి.. భారత్‌ 128/5
X

అడిలైడ్‌ వేదికగా బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌, టీమిండియా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌ రెండో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌.. 5 వికెట్లు కోల్పోయి 128 రన్స్‌ చేసింది. పేలవమైన బ్యాటింగ్‌తో ఓటమి దిశగా పయనిస్తున్నది. ఈ పింక్‌ బాల్‌ మ్యాచ్‌లో వరుసగా రెండో రోజూ ఆస్ట్రేలియానే ఆధిపత్యాన్ని చలాయించింది. యశస్వి జైస్వాల్ 24, శుభ్‌మన్‌ గిల్‌ 28, కేఎల్‌ రాహుల్‌ 7, విరాట్‌ కోహ్లీ 11, రోహిత్ శర్మ 6 రన్స్‌ మాత్రమే చేసి పెవిలియన్‌ చేరారు. ప్రస్తుతం కీపర్‌ రిషబ్‌ పంత్‌ (28 నాటౌట్‌), నితీశ్‌ర్‌ రెడ్డి (15 నాటౌట్‌) క్రీజ్‌లో ఉన్నారు స్కాట్‌ 2, పాట్‌ కమిన్స్‌ 2, మిచెల్‌ స్టార్క్‌ 1 వికెట్‌ తీశారు. ప్రస్తుతం భారత్‌ 28 రన్స్‌ వెనుకంజలో ఉన్నది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 180, ఆస్ట్రేలియా 337 రన్స్‌ ఆలౌట్‌ అయిన సంగతి తెలిసిందే.

తొలి ఇన్నింగ్స్‌లో ఓవర్‌ నైట్‌ స్కోర్‌ 86/1తో రెండో రోజు ఆటను ప్రారంభించిన కంగారులు 337 రన్స్‌ కు ఆలౌట్‌ అయ్యారు. ట్రావిస్‌ హెడ్‌ (140) భారీ సెంచరీ చేశాడు. జస్‌ ప్రీత్‌ బూమ్రా 4, సిరాజ్‌ 4, నితీశ్‌, అశ్విన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ క్రమంలోనే మొదటి ఇన్నింగ్స్‌లో 157రన్స్‌ ఆధిక్యం సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌ మాదిరిగానే తడబడుతున్నది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించాలంటే అద్భుతమే జరగాలి. పంత్‌, నితీశ్‌పైనే భారత్‌ ఆశలు పెట్టుకున్నది.

First Published:  7 Dec 2024 5:40 PM IST
Next Story