Telugu Global
Sports

చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. 7 వికెట్లు ఔట్‌

బోలాండ్‌ ధాటికి కుప్పకూలిన టీమిండియా టాప్ ఆర్డర్

చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. 7 వికెట్లు ఔట్‌
X

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు మళ్లీ షాక్‌ తగిలింది. వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. 64 ఓవర్లకు భారత్‌ 7 వికెట్లు కోల్పోయింది. రవీంద్ర జడేజా (26)ను మిచెల్‌ స్టార్క్‌ ఎల్బీ చేశాడు. జడేజా డీఆర్‌ఎస్‌ తీసుకున్నా ఫలితం సానుకూలంగా రాలేదు. దీంతో జడేజా నిరాశగా పెవిలియన్‌ను చేరాడు. ఆసీస్‌ బౌలర్‌ బోలాండ్‌ వేసిన వరుస బంతుల్లో పంత్‌ (40) నితీశ్‌రెడ్డి (0) రన్స్‌కు ఔటయ్యారు. ఆఫ్‌సైడ్‌ బాల్‌ను కదిలించి నితీశ్‌ స్లిప్‌లో దొరికిపోయాడు. అంతకు ముందు పంత్‌ బోలాండ్‌ బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించి మిడాఫ్‌లో కిమన్స్‌ చేతికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. భారత్‌ ప్రస్తుత స్కోరు 143/7. సుందర్‌ (9*), ప్రసిధ్‌ కృష్ణ (0*) క్రీజులో ఉన్నారు. యశస్వి 10, కేఎల్‌ రాహుల్‌ 4, శుభ్ మన్‌ గిల్‌ 20, విరాట్‌ కోహ్లీ 17 రన్స్‌కు వెనుదిరిగారు. ఆసీస్‌ బౌలర్లలో బోలాండ్‌ 4 వికెట్లు, మిచెల్‌ స్టార్క్‌ 2, నాథన్‌ లైయన్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. బోలాండ్‌ టెస్ట్‌ కెరీర్‌లో 50 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.

అంతకుముందు మళ్లీ అదే కథ పునరావృతమైంది. ఆఫ్‌సైడ్‌ బాల్‌ను వెంటాడి విరాట్‌ స్లిప్‌లో దొరికిపోయాడు. బోలాండ్‌ వేసిన బాల్‌ను (31.3వ ఓవర్‌) ఆడేందుకు కోహ్లీ యత్నించాడు. బ్యాట్‌ ఎడ్జ్‌ను తాకి బంతిని వెబ్‌స్టర్‌ అద్భుతంగా ఒడిసిపట్టాడు. దీంతో 72 రన్స్ కే భారత్‌ కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయింది.

First Published:  3 Jan 2025 11:14 AM IST
Next Story