ఐపీఎల్ 2025 షెడ్యూల్ విడుదల..తొలి మ్యాచ్ ఎప్పుడంటే?
అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది

క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. ఐపీఎల్ 2025 షెడ్యూల్‌ను విడుదలైంది. మార్చి 22వ నుంచి 62 రోజులపాటు మ్యాచ్‌లు కొనసాగనున్నాయి. తొలి డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరును మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. 13 వేదికల్లో 74 మ్యాచ్‌లు జరుగనున్నాయి.ఐపీఎల్ 2025 సీజన్ ను హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తోన్న సంగతి తెలిసిందే. అయితే గతేడాది లానే ఈసారి కూడా ఏపీ వైజాగ్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. గత సీజన్ లో తొలి రెండు మ్యాచ్ లను వైజాగ్ లో నిర్వహించారు. అలానే ఈ సారి కూడా ఇప్పుడు వైజాగ్‌లో మ్యాచులు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో వైజాగ్ క్రికెట్ అభిమానులకు కనువిందు చేస్తోంది.
స్టార్ స్పోర్ట్స్ చానెళ్లతో పాటు స్పోర్ట్స్ 18, జీయో హాట్ స్టార్‌లోనూ షెడ్యూల్ ఎనౌన్స్‌మెంట్ ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. మార్చి 22వ తేదీన ఐపీఎల్ ప్రారంభం కానుంది. ప్రారంభమ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరును ఢీకొట్టబోతుంది. ఈడెన్ గార్డెన్స్ ప్రారంభ ఈవెంట్ తో పాటు మొదటి మ్యాచ్ కు వేదిక కానుంది. మొత్తం జట్లు ఐపీఎల్ టైటిల్ కోసం పోటీ పడబోతున్నాయి. ఫైనల్ మ్యాచ్ మే 25న జరగనుంది. హైదరాబాద్ తొలి మ్యాచ్‌ను రాజస్థాన్‌తో మార్చి23న ఆడనుంది. ఆ తర్వాత మార్చి 27న లఖ్‌నవూతో, మార్చి 30న దిల్లీ, ఏప్రిల్ 3న కోల్‌కతా, ఏప్రిల్ 6న గుజరాత్, 12, పంజాబ్, 17న ముంబయి, 23న ముంబయి, 25న చెన్నై, మే 2న గుజరాత్, 5న దిల్లీ, 10న కోల్‌కతా, 13న బెంగళూరు, మే 18న లఖ్‌నవూతో ఆడనుంది.