ఆ ఫోన్లకు ఇక వాట్సప్ సర్వీస్‌లు నిలిపివేత
సుమారు 9-10 ఏళ్ల కిందట తీసుకొచ్చిన ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఓఎస్‌తో పనిచేస్తున్న ఫోన్లకు జనవరి 1 నుంచి తన సర్వీసులను నిలిపివేయనున్న వాట్సప్
యూజర్లకు కొత్త తరహా ఫీచర్లు అందించడమే కాదు భద్రతాపరంగానూ వాట్సప్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. యాప్‌లో బగ్స్ ఉంటే సరిచేయడంతో పాటు లేటెస్ట్ టెక్నాలజీ అందుకోలేని పాత ఫోన్లకు తమ సపోర్ట్ నిలిపివేస్తుంటుంది. కొత్త ఏడాదిలోనూ కొన్ని ఫోన్లకు వాట్సప్ సర్వీసులు నిలిచిపోనున్నాయి. ఇప్పటికీ యూజర్లు ఆ ఫోన్లు వాడుతుంటే కొత్త ఫోన్లకు అప్‌గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది.
సుమారు 9-10 ఏళ్ల కిందట తీసుకొచ్చిన ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఓఎస్‌తో పనిచేస్తున్న ఫోన్లకు జనవరి 1 నుంచి వాట్సప్ తన సర్వీసులను నిలిపివేయనున్నది. ఈ మధ్యకాంలో సైబర్ నేరగాళ్లు వాట్సప్ వేదికగానూ మోసాలకు పాల్పడుతున్న వేళ.. పాత ఫోన్లలో వాట్సప్ వాడటం సరికాదు. ఈ క్రమంలోనే ఆయా ఫోన్లకు వాట్సప్ తన సపోర్టు నిలిపివేయనున్నది. ఐఓఎస్ 15.1, అంతకంటే పాత వెర్షన్లు వాడుతున్న ఐఫోన్లకూ తన సపోర్టు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఒకవేళ ఎవరైనా ఇప్పటికే పాత ఐఫోన్ 5 ఎస్, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ ఫోన్లు వాడుతుంటే వారు కూడా కొత్త ఫోన్లకు అప్‌గ్రేడ్ కావాల్సి ఉంటుంది. ఐఫోన్ యూజర్లకు మే 5 వరకు గడువు ఉన్నది.
వాట్సప్ సర్వీస్‌లు బంద్ కానున్న ఆండ్రాయిడ్ ఫోన్లు ఇవే
శాంసంగ్ గెలాక్సీ ఎస్3, మోటో జీ, హెచ్‌టీసీ వన్ ఎక్స్, హెచ్‌టీసీ వన్ ఎక్స్+, హెచ్‌టీసీ డిజైర్ 500, హెచ్‌టీసీ డిజైర్ 601, శాంసంగ్ గెలాక్సీనోట్ 2, శాంసంగ్ గెలాక్సీ ఎస్4 మినీ, మోటో రేజర్ హెచ్డీ, మోటో ఈ 2014, ఎల్జీ ఆప్టిమస్ జీ, ఎల్జీ నెక్సస్ 4, ఎల్జీ జీ 2 మినీ, ఎల్జీ ఎల్ 90, సోనీ ఎక్స్‌పీరియా జడ్, సోనీ ఎక్స్‌పీరియా ఎస్పీ, సోనీ ఎక్స్‌పీరియా టీ, సోనీ ఎక్స్‌పీరియా వి తదితర ఫోన్లు ఉన్నాయి. దాదాపు పదేళ్ల కిందట వచ్చిన ఈ ఫోన్లు ఇప్పటికీ వాడుతుండటం అరుదు. ఒకవేళ ఎవరైనా వాడుతుంటే మాత్రం వాట్సప్ సర్వీస్‌ల కోసం కొత్త ఏడాదిలో కొత్త ఫోన్‌కు మారాల్సిందే.