స్క్రీన్‌షాట్ బ్లాక్, ఫార్మాటింగ్ టూల్స్.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు!
యూజర్ల కోసం వాట్సాప్ కొత్త సేఫ్టీ ఫీచర్ తీసుకొచ్చింది. దీంతో ఇకపై ప్రొఫైల్ పిక్చర్‌ను స్క్రీన్ షాట్ తీయలేరు. అలాగే టెక్స్ట్‌ను మరింత అందంగా రూపొందించేందుకు కొన్ని ఫార్మాటింగ్ ఫీచర్లు కూడా జత చేసింది.
యూజర్ల కోసం వాట్సాప్ కొత్త సేఫ్టీ ఫీచర్ తీసుకొచ్చింది. దీంతో ఇకపై ప్రొఫైల్ పిక్చర్‌ను స్క్రీన్ షాట్ తీయలేరు. అలాగే టెక్స్ట్‌ను మరింత అందంగా రూపొందించేందుకు కొన్ని ఫార్మాటింగ్ ఫీచర్లు కూడా జత చేసింది. వివరాల్లోకి వెళ్తే..
యూజర్ల ప్రైవసీని దృష్టిలో ఉంచుకుని వాట్సాప్ ఓ కొత్త సెట్టింగ్‌ను అప్ డేట్ చేసింది. గతంలో వాట్సాప్ ప్రొఫైల్ పిక్‌ను డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉండేది. అయితే ఆ ఆప్షన్‌ను 2019లో తొలగించింది వాట్సాప్. దాంతో చాలామంది ఫొటోని స్క్రీన్‌షాట్ తీస్తున్నారు. ఇలా స్క్రీన్‌షాట్ తీసిన ఫొటోలను ఇతర మాధ్యమాల్లో ఫేక్ ఐడీలకు ఉపయోగించే అవకాశం ఉంది. కాబట్టి వాట్సాప్ ఇప్పుడు సెట్టింగ్స్‌లో మార్పులు చేసింది. దీంతో ఇకపై వాట్సాప్ డీపీలను స్క్రీన్‌షాట్ తీసేందుకు వీలు పడదు. డీప్ ఫేక్ వంటి టెక్నాలజీలకు చిక్కకుండా ఉండేందుకు ఈ ఫీచర్ బాగా పనికొస్తుంది. అయితే ఈ కొత్త అప్‌డేట్ ప్రస్తుతం బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుంది.
ఛాటింగ్స్‌లో డిఫరెంట్ ఫార్మాట్స్‌లో టెక్స్ట్ పంపుకునే విధంగా సరికొత్త టూల్స్‌ను కూడా తీసుకొచ్చింది వాట్సాప్. టెక్స్ట్‌లోని ముఖ్యమైన అంశాలకు నంబరింగ్ ఇవ్వడం, టెక్స్ట్ హైలైట్ చేయడం, బుల్లెట్స్ రూపంలో పాయింట్స్ రాయడం.. ఇలా పలు ఫార్మాటింగ్ ఫీచర్లు అందుబాటులో ఉంచింది. గ్రూప్ ఛాట్స్‌లో ఇవి ఉపయోగకరంగా ఉంటాయి.
ఇకపోతే వాట్సప్ ఛాట్స్‌ను కస్టమైజ్ చేసుకునే విధంగా కొత్తగా ఫేవరెట్స్ ట్యాబ్‌ను తీసుకురానుంది వాట్సాప్. త్వరలో రానున్న కొత్త అప్‌డేట్‌తో ఈ ఫీచర్ పరిచయం కానుంది. ఈ ఫీచర్ సాయంతో ఆల్, అన్‌రీడ్, ఫేవరెట్స్.. ఇలా మీకు నచ్చినట్టుగా ఛాట్స్‌ను కస్టమైజ్డ్‌గా లేబుల్స్ చేసుకోవచ్చు.