సరికొత్త పిగ్ బుచరింగ్ సైబర్ స్కామ్.. ఇదెలా ఉంటుందంటే
ఈ మధ్యకాలంలో రోజుకో కొత్తరకం సైబర్ స్కామ్ పుట్టుకొస్తుంది. మోసం చేయడానికి కొత్తకొత్త ఎత్తుగడలు ఆలోచిస్తున్నారు సైబర్ నేరగాళ్లు.
ఈ మధ్యకాలంలో రోజుకో కొత్తరకం సైబర్ స్కామ్ పుట్టుకొస్తుంది. మోసం చేయడానికి కొత్తకొత్త ఎత్తుగడలు ఆలోచిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఏదో ఒక ఆశ చూపి మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్నే ‘పిగ్ బుచరింగ్’ స్కామ్ అంటున్నారు. ముఖ్యంగా మనదేశంలో కోట్ల సంఖ్యలో ఈ మోసాలు జరుగుతున్నట్టు నిపుణులు గుర్తించారు. ఈ మోసాలు ఎలా ఉంటాయంటే.
ఏదో ఒక ఆశ చూపి మోసం చేయాడాన్నే ‘పిగ్ బుచరింగ్’ స్కామ్ అంటారు. సమాజంలో ఎక్కువ శాతం మంది ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలుసుకుని దానికి తగ్గట్టుగా రకరకాల ఆశలు చూపడం ఈ స్కామ్‌లో భాగం. ఉదాహరణకు ఉద్యోగాల పేరుతో మోసం చేయడం, క్రిప్టో పెట్టుబడుల పేరుతో డబ్బు కాజేయడం లాంటివన్న మాట. ఈ తరహా స్కామ్‌లు పక్కా ప్లానింగ్‌తో జరుగుతాయి. ముందుగా వ్యక్తుల అన్ని వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా అడుగులు వేస్తారు. మోసం కంటే ముందుగా నమ్మకాన్ని చూరగొంటారు. ఫేక్ ప్రొఫైల్స్‌తో జాబ్ రిక్రూట్‌మెంట్ కంపెనీ అని లేదా ఇన్వెస్ట్‌మెంట్ ఏజెన్సీ అని నమ్మించే ప్రయత్నం చేస్తారు. దానికోసం ఫేక్ వెబ్‌సైట్లు, వాట్సాప్ గ్రూప్స్ వంటివి కూడా క్రియేట్ చేస్తారు. జరిగేదంతా నిజమని నమ్మేలా చేసి ఆ తర్వాత అసలు స్కామ్ అమలు చేస్తారు.
పార్ట్ టైమ్ జాబ్స్, విదేశాల్లో జాబ్ ఆఫర్స్, విదేశాల్లో పనులకు కుదర్చడం, క్రిప్టో పెట్టుబడులు, ఆయిల్ ట్రేడింగ్.. ఇలా రకరకాల విధాలుగా ఈ స్కామ్స్ జరుగుతాయి. నేరుగా కాకుండా ఇతర మార్గాల్లో ఉద్యోగాలు వెతికేవాళ్లు, విదేశాలకు వెళ్లి పనిచేయాలకునేవాళ్లు, తక్కువ టైంలో ఎక్కువ డబ్బు ఆశించేవాళ్లు, బెట్టింగ్, క్రిప్టో ట్రేడింగ్ వంటివి చేసేవాళ్లను నేరగాళ్లు టార్గెట్‌గా చేసుకుంటారు. ఇది దొంగ మార్గం అని చెప్తూనే.. తక్కువ టైంలో ఎక్కువ సంపాందించొచ్చని నమ్మిస్తారు. అలా డిపాజిట్లు, పెట్టుబడుల పేరుతో డబ్బు కాజేయడం, విదేశాలకు తీసుకెళ్లి మోసగించడం వంటివి చేస్తుంటారు.
జాగ్రత్తలు ఇలా..
ఉద్యోగాలు, పెట్టుబడుల కోసం సురక్షితమైన మార్గాలను వెతకాలే తప్ప షార్ట్‌కట్స్ కోసం చూడకూడదు. ముఖ్యంగా మోసపూరితమైన మార్గాల జోలికి వెళ్లకూడదు.
తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌లకు రిప్లై ఇవ్వకూడదు. అలాంటి వాటిని వెంటనే బ్లాక్ చేయాలి. ఎలాంటి లింక్స్‌పై క్లిక్ చేయకూడదు.
వ్యక్తుల అత్యాసను ఆసరాగా చేసుకుని ఎక్కువ మోసాలు జరుగుతుంటాయి. కాబట్టి అత్యాసకు పోకుండా జాగ్రత్తగా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి.
జాబ్ లేదా ఇన్వెస్ట్‌మెంట్స్ పేరుతో ఎవరైనా ఆశ చూపితే కచ్చితంగా అనుమానించాలి. ఉద్యోగాలు, పెట్టుబడుల కోసం బోలెడు ప్లా్ట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. కావాలంటే వాటిని వాడుకోవచ్చు.
ఇకపోతే ఎవ్వరితోనూ బ్యాంక్ వివరాలు, ఆధార్, పాన్ వివరాలు, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దు. మోసపోతున్నట్టు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.