Telugu Global
Science and Technology

ఇంటర్నెట్ స్పీడ్‌లో ఇండియా ర్యాంక్ ఎంతంటే..

ప్రపంమంతా టెక్నాలజీ వైపు వేగంగా అడుగులు వేస్తున్న ఈ రోజుల్లో మనదేశం కూడా రేస్‌లో ముందుంటోంది.

ఇంటర్నెట్ స్పీడ్‌లో ఇండియా ర్యాంక్ ఎంతంటే..
X

ప్రపంమంతా టెక్నాలజీ వైపు వేగంగా అడుగులు వేస్తున్న ఈ రోజుల్లో మనదేశం కూడా రేస్‌లో ముందుంటోంది. గ్లోబల్ బ్రాండ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్స్‌ను టెస్ట్ చేసే ‘ఊక్లా’ సంస్థ రీసెంట్‌గా చేసిన గ్లోబల్ స్పీడ్‌టెస్ట్‌లో భారత్‌ ర్యాంకు 72 స్థానాలు మెరుగుపడి 47వ స్థానానికి చేరింది. ఇంటర్నెట్ స్పీడ్‌లో యూకె, జపాన్ దేశాలను కూడా దాటేసింది. వివరాల్లోకి వెళ్తే..

స్పీడ్ టెస్ట్ గ్లోబల్ సూచీలో ఇండియా.. 47వ ర్యాంకులో ఉంది. బంగ్లాదేశ్‌, శ్రీలంక, పాకిస్తాన్‌ వంటి పొరుగుదేశాలతో పాటు, మెక్సికో, తుర్కియే, యూకె, జపాన్, సౌత్ ఆఫ్రికా దేశాల కంటే కూడా ముందుంది. దేశంలో 5జీ సేవలు మొదలైన తర్వాత ఇంటర్నెట్‌ వేగం 3.59 రెట్లు అధికమైనట్టు రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోంది. 2022లో 13.87 ఎంబీపీఎస్‌గా ఉన్న డౌన్‌లోడ్‌ స్పీడ్ ఈ ఏడాది ఆగస్టు నాటికి 50.21 ఎంబీపీఎస్‌కు చేరింది. దీంతో ఇంటర్నెట్ స్పీడ్‌లో ఇండియా ర్యాంకు 119 నుంచి 72 స్థానాలు ఎగబాకి 47వ స్థానానికి చేరుకుంది.

దేశంలో ప్రస్తుతం చాలా సర్వీసులు 4జీ నుంచి 5జీకి అప్‌డేట్ అవుతున్నాయి. 5జీ స్మార్ట్‌ఫోన్స్ వాడుతున్న యూజర్లు కూడా గణనీయంగా పెరుగుతున్నారు. దేశంలోని చాలా ప్రాంతాలకు 5జీ నెట్‌వర్క్ కవరేజ్‌ను పెంచుతున్నాయి టెలికాం కంపెనీలు. ఇవన్నీ .. ఏడాదిలో ఇంటర్నెట్ వాడకాన్ని రెట్టింపు చేశాయి. దీంతోపాటు ఎయిర్ ఫైబర్ వంటి లేటెస్ట్ ఇంటర్నెట్ సర్వీసులను కూడా తీసుకొస్తున్నాయి టెలికాం కంపెనీలు. ఇదిలాగే కంటిన్యూ అయితే ఫ్యూచర్‌‌లో ఇంటర్నెట్ వాడకంలో ఇండియా మరింత మెరుగైన స్థానం పొందుతుందని నిపుణులు అంటున్నారు.

First Published:  5 Oct 2023 5:46 PM IST
Next Story