Telugu Global
Science and Technology

ఇక అన్నిటికీ టైప్ 'సి'.. చార్జింగ్ కష్టాలకు చెల్లు చీటీ

స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌ లు, ల్యాప్‌ టాప్‌ లకు యూఎస్‌బీ టైప్ 'సి' ఛార్జింగ్‌ పోర్ట్ లు దశలవారీగా అమలులోకి రాబోతున్నాయి. దీనివల్ల ఈ వేస్టేజ్ కూడా తగ్గుతుంది.

ఇక అన్నిటికీ టైప్ సి.. చార్జింగ్ కష్టాలకు చెల్లు చీటీ
X

సెల్ ఫోన్ చార్జర్ కావాలంటే గతంలో సన్నపిన్నా, లావు పిన్నా అని అడిగేవారు. ఇప్పుడు అవి పూర్తిగా పాతబడిపోయాయి. ఇప్పుడంతా టైప్ 'సి' హవా నడుస్తోంది. మార్కెట్లోకి కొత్త కొత్త ఫోన్లు వస్తున్నా అన్నిటికీ టైప్'సి'నే సరిపోయేలా డిజైన్ చేస్తున్నారు. అయితే యాపిల్ లాంటి కొన్ని కంపెనీలు మాత్రం తమ సొంత చార్జింగ్ పోర్ట్ లను వదిలిపెట్టనంటున్నాయి. దీనివల్ల వినియోగదారులకు కష్టంగా ఉంటోంది. ఈ వేస్టేజ్ కూడా ఎక్కువవుతోంది. ఒక ఇంట్లో నాలుగు రకాల ఫోన్లు ఉంటే నాలుగు చార్జర్లు ఉండాల్సిందే. రకరకాల సెల్ ఫోన్లకు రకరకాల చార్జర్లు ఉండటం కంటే సెల్ ఫోన్లన్నిటికీ ఒకటే చార్జింగ్ పోర్ట్, ఒకటే చార్జింగ్ పిన్ ఉండేలా డిజైన్ చేస్తే బాగుంటుందని అధికార వర్గాలంటున్నాయి. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు ఈ మేరకు కంపెనీలు, పరిశ్రమ సంఘాలతో సమావేశమై చర్చించారు. అన్నిటికీ ఒకేరకమైన చార్జింగ్ పోర్ట్ లపై సాధ్యాసాధ్యాలను పరిశీలించారు.

సమ్మతమే కానీ..

ఇప్పటికిప్పుడు చార్జింగ్ పోర్ట్ లు మార్చాలంటే కుదరదు, అయితే దశలవారీగా అన్నీ టైప్'సి'లోకి మార్చుకునేలా ప్రయత్నిస్తామని వివిధ కంపెనీలు, పరిశ్రమలు అంగీకరించాయి. స్మార్ట్ ఫోన్లతోపాటు ఇతర అన్నిరకాల ఎలక్ట్రానిక్ పరికరాలకు కూడా ఇలాంటి చార్జింగ్ పోర్ట్ లే ఉండేలా వినియోగదారుల మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు మొదలు పెట్టింది.

ఎలక్ట్రానిక్ వేరియబుల్స్ కి ఒకేరకమైన చార్జింగ్ పోర్ట్ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఉప కమిటీని ఏర్పాటు చేస్తోంది వినియోగదారుల మంత్రిత్వ శాఖ. స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌ లు, ల్యాప్‌ టాప్‌ లకు యూఎస్‌బీ టైప్‌'సి' ఛార్జింగ్‌ పోర్ట్ లు దశలవారీగా అమలులోకి రాబోతున్నాయి. దీనివల్ల ఈ వేస్టేజ్ కూడా తగ్గుతుంది. రకరకాల చార్జర్లు కొనడం, కొత్త ఫోన్ రాగానే తిరిగి కొత్త చార్జర్ తీసుకోవడం ఇక ఉండదు. చార్జర్ ఏదైనా కొత్త ఫోన్లకు సూటవుతుంది. అయితే ఫీచర్ ఫోన్లకు మాత్రం పాత చార్జర్లే ఉంటాయి. దానికి ప్రత్యేకమైన పోర్ట్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లు, ల్యాప్ టాప్ లు ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు మాత్రం టైప్'సి' పోర్ట్ ఉంటుంది. దీనికోసం టైప్'సి' చార్జర్ ఉపయోగిస్తే సరిపోతుంది.

First Published:  17 Nov 2022 12:19 PM IST
Next Story