ట్రూ కాలర్‌లో కొత్త ఫీచర్.. ఫేక్ కాల్స్ కనిపెట్టొచ్చు!
Truecaller new features: కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్.. రీసెంట్‌గా ఓ అదిరిపోయే అప్‌డేట్ తీసుకొచ్చింది. స్పామ్ కాల్స్, ఫేక్ కాల్స్‌కు చెక్ పెడుతూ ‘గవర్నమెంట్ డిజిటల్ డైరెక్టరీ’ అనే కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది.
కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్.. రీసెంట్‌గా ఓ అదిరిపోయే అప్‌డేట్ తీసుకొచ్చింది. స్పామ్ కాల్స్, ఫేక్ కాల్స్‌కు చెక్ పెడుతూ 'గవర్నమెంట్ డిజిటల్ డైరెక్టరీ' అనే కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. దీనివల్ల ఉపయోగమేంటంటే..
కాల్ చేసి.. గవర్నమెంట్ అధికారులమని లేదా మంత్రి, ఎమ్మెల్యేలం అంటూ డబ్బులు వసూలు చేసే నేరగాళ్లు ఇటీవల పెరిగిపోయారు. అలాంటి క్రైమ్స్‌కు చెక్ పెట్టేందుకు 'గవర్నమెంట్ డిజిటల్ డైరెక్టరీ' అనే ఫీచర్ తీసుకొస్తున్నట్టు ట్రూకాలర్ ప్రకటించింది.
ఇందులో ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, ప్రజా ప్రతినిధుల పేర్లను ఈజీగా గుర్తించొచ్చని ట్రూకాలర్ చెప్తోంది. బాధితులు తమ సమస్యల్ని నేరుగా అధికారులు, సంబంధిత ఎమ్మెల్యే, ఎంపీలతో చర్చించేందుకు వీలుగా గవర్నమెంట్ డిజిటల్ డైరెక్టరీ ఉపయోగపడుతుంది. ఈ డైరెక్టరీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు, ప్రజా ప్రతినిధుల ఫోన్ నెంబర్లు ఉంటాయి.
ప్రభుత్వ అధికారులమని చెప్తూ సామాన్యుల్ని మోసం చేసే వాళ్లని ఇకపై ఈజీగా గుర్తించే అవకాశం ఉందని, తద్వారా మోసాల్ని అరికట్టొచ్చని ట్రూకాలర్ తెలిపింది. ఎవరైనా మోసం చేసేందుకు ప్రయత్నిస్తే వెంటనే ఆ సమాచారం గవర్నమెంట్ డిజిటల్ డైరెక్టరీలో ఉన్న సంబంధిత అధికారులకు సమాచారం వెళ్తుందని వెల్లడించింది. ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంది. ట్రూకాలర్ యాప్‌ను అప్‌డేట్ చేసి ఈ ఫీచర్‌ను పొందొచ్చు.