క్యూఆర్ స్కాన్‌తో ఏటియం నుంచి డబ్బు.. ప్రాసెస్ ఇదే!
ఏటీయం నుంచి డబ్బులు తీయాలంటే కచ్చితంగా డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ఉండాల్సిందే. అయితే ఇకపై కార్డులతో పని లేకుండా యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్‌తో ఏటీయం నుంచి డబ్బులు తీసుకోగలిగేలా కొత్త విధానం అమలులోకి రానుంది.
ఏటీయం నుంచి డబ్బులు తీయాలంటే కచ్చితంగా డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ఉండాల్సిందే. అయితే ఇకపై కార్డులతో పని లేకుండా యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్‌తో ఏటీయం నుంచి డబ్బులు తీసుకోగలిగేలా కొత్త విధానం అమలులోకి రానుంది. ఇదెలా పని చేస్తుందంటే..
కార్డు అవసరం లేకుండా కేవలం ఫోన్ ద్వారా డబ్బును విత్‌డ్రా చేసుకొనే ఫీచర్‌ను త్వరలోనే ప్రవేశపెట్టనున్నట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ప్రకటించింది. ఈ ఫీచర్‌ను ఇప్పటికే ముంబైలో టెస్ట్ చేశారు. మరికొన్ని రోజుల్లోనే దేశంలోని మిగతా ఏటీయంలకు కూడా ఈ ఫీచర్‌ను తీసుకొస్తామని అధికారులు చెప్తున్నారు.
యూపీఐ ఏటీయం సర్వీస్‌ను జపాన్‌కు చెందిన ‘హిటాచీ పేమెంట్ సర్వీసెస్’ డెవలప్ చేసింది. ‘హిటాచీ మనీస్పాట్ ఏటీయం’ పేరిట దీన్ని ముంబై ఏర్పాటు చేశారు. సెప్టెంబరు 5న ముంబైలో జరిగిన ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2023’లో దీన్ని మొదటిసారిగా ఆవిష్కరించారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి దీన్ని రూపొందించినట్లు సంస్థ పేర్కొంది. ఈ ఏటీయంలు అందుబాటులోకి వస్తే ఫోన్‌లోని యూపీఐ యాప్‌ల సాయంతోనే ఏటీయం నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు.
యూపీఐ- ఏటీయం నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవడం ఎంతో ఈజీ. అంతే కాదు చాలా సేఫ్ కూడా. ముందుగా ఏటీయంపై ‘యూపీఐ కార్డ్‌లెస్ క్యాష్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత అమౌంట్ మొత్తాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. దాన్ని ఫోన్ లోని యూపీఐ యాప్ ద్వారా స్కాన్ చేసి, పిన్ ఎంటర్ చేస్తే.. మెషీన్ నుంచి క్యాష్ వచ్చేస్తుంది. ఫోన్‌లో యూపీఐ యాప్ ఉన్న ఎవరైనా ఏటీయం నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు.
దీంతోపాటు యూపీఐలో వాయిస్ ఆధారిత పేమెంట్స్ వంటి కొత్త రకాల చెల్లింపు విధానాలను తీసుకొచ్చే పనిలో ఉంది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్ సందర్భంగా ఈ కొత్త ఆప్షన్ల గురించి ప్రస్తావించింది.