Telugu Global
Science and Technology

మిడ్‌రేంజ్ బడ్జెట్‌లో రెడ్‌మీ13 ఫోన్ లాంఛ్! ఫీచర్లివే..

రెడ్ మీ 13 5జీ 6 జీబీ+ 128 జీబీ వేరియంట్ ధర రూ.12,999, 8 జీబీ ర్యామ్‌ + 128 జీబీ వేరియంట్ ధర రూ.14,999గా ఉంది.

మిడ్‌రేంజ్ బడ్జెట్‌లో రెడ్‌మీ13 ఫోన్ లాంఛ్! ఫీచర్లివే..
X

ప్రముఖ మొబైల్ బ్రాండ్ షావోమీ నుంచి ‘రెడ్‌మీ 13 5జీ (Redmi 13 5G)’ పేరుతో లేటెస్ట్ మోడల్ రిలీజ్ అయింది. జులై 9న రిలీజయిన ఈ మొబైల్‌లో రింగ్ ఫ్లాష్, షావోమీ హైపర్ ఓఎస్ వంటి లేటెస్ట్ ఫీచర్లున్నాయి. వీటి ధరలు, స్పెసిఫికేషన్ల వివరాల్లోకి వెళ్తే..

రెడ్‌మీ 12 మొబైల్ కు కొనసాగింపుగా రెడ్‌మీ 13 5జీ మొబైల్ మార్కెట్లో లాంఛ్ అయింది. ఈ మొబైల్.. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 2ఏఈ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 14 బేస్డ్ షావోమీ హైపర్ ఓఎస్‌పై రన్ అవుతుంది. ఇందులో 6.79 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120హెర్ట్జ్ రీఫ్రెష్‌ రేటుని సపోర్ట్ చేస్తుంది.

రెడ్‌మీ 13 మొబైల్ కెమెరాల విషయానికొస్తే.. ఇందులో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతోపాటు మరో మాక్రో సెన్సర్, ముందువైపు 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాలున్నాయి. కెమెరా పక్కన సరికొత్త రింగ్‌ ఫ్లాష్‌ కనిపిస్తుంది. ఇది ఫొటో తీసేటప్పుడే కాకుండా నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు బ్లింక్ అయ్యేలా సెట్టింగ్ చేసుకోవచ్చు.

ఇకపోతే రెడ్‌మీ 13 మొబైల్ లో 33 వాట్ ఫాస్ట్‌ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5030 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. వీటితోపాటు ఇందులో కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌, డ్యుయల్‌ గ్లాస్‌ డిజైన్‌, ఐపీ 53 రేటింగ్, వెట్ టచ్ సపోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, డ్యుయల్ 5జీ సిమ్, వైఫై802.11, బ్లూటూత్ 5.3 వంటి ఫీచర్లతోపాటు రెండు ఓఎస్‌ అప్‌డేట్లు, నాలుగేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లు కూడా వస్తాయి.

రెడ్ మీ 13 5జీ 6 జీబీ+ 128 జీబీ వేరియంట్ ధర రూ.12,999, 8 జీబీ ర్యామ్‌ + 128 జీబీ వేరియంట్ ధర రూ.14,999గా ఉంది. బ్లాక్‌ డైమండ్‌, హవైన్‌ బ్లూ, ఆర్కిడ్‌ పింక్‌ రంగుల్లో అందుబాటులో ఉంది.

First Published:  10 July 2024 10:42 AM GMT
Next Story