Realme | ఫోనిక్స్ డిజైన్‌తో రియల్‌మీ పీ1 5జీ సిరీస్ ఫోన్లు.. ధరెంతో తెలుసా.!
Realme | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ (Realme) తాజాగా రియల్‌మీ పీ1 5జీ సిరీస్ (Realme P1 5G) పోన్లను బారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. రియల్‌మీ పీ1 5జీ (Realme P1 5G) సిరీస్‌లో రియల్‌మీ పీ1 5జీ (Realme P1 5G), రియల్‌మీ పీ1 ప్రో 5జీ ( (Realme P1 Pro 5G) ఫోన్లు ఉన్నాయి.
Realme | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ (Realme) తాజాగా రియల్‌మీ పీ1 5జీ సిరీస్ (Realme P1 5G) పోన్లను బారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. రియల్‌మీ పీ1 5జీ (Realme P1 5G) సిరీస్‌లో రియల్‌మీ పీ1 5జీ (Realme P1 5G), రియల్‌మీ పీ1 ప్రో 5జీ ( (Realme P1 Pro 5G) ఫోన్లు ఉన్నాయి. రియల్‌మీ పీ1 5జీ ఫోన్ మీడియాటె్ డైమెన్సిటీ 7050 ఎస్వోసీ చిప్‌సెట్, రియల్‌మీ పీ1 ప్రో 5జీ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్1 ప్రాసెసర్‌తో వచ్చాయి. రెండు ఫోన్లూ 45 వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీతో పని చేస్తాయి. గ్లోసీ, స్పార్క్లింగ్ ఫోనిక్స్ డిజైన్లతో రూపుదిద్దుకున్నాయి ఈ రెండు ఫోన్లు. వీటితోపాటు రియల్‌మీ తన పాడ్2 వై-ఫై వేరియంట్, బడ్స్‌టీ110లనూ మార్కెట్లో ఆవిష్కరించింది.
రియల్‌మీ పీ1 5జీ ఫోన్ ధరలు ఇలా
రియల్‌మీ పీ1 5జీ ఫోన్ 6-జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.14,999, 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.16,999లకు అందుబాటులో ఉంటుంది. ఈ నెల 22 మధ్యాహ్నం ఫోన్ విక్రయాలు మొదలవుతాయి. పీకాక్ గ్రీన్, పోనిక్స్ రెడ్ కలర్ ఆప్షన్లలో డిజైన్ చేశారు.
ఇలా రియల్‌మీ పీ1 ప్రో 5జీ ధరలు
రియల్‌మీ పీ ప్రో 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.19,999, 8-జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.20,999లకు సొంతం చేసుకోవచ్చు. ఈ నెల 30 మధ్యాహ్నం 12 గంటల నుంచి విక్రయాలు మొదలవుతాయి. ఈ నెల 22 సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య రెడ్ లిమిటెడ్ సేల్స్ జరుగుతాయి. ప్యారట్ బ్లూ, ఫోనిక్స్ రెడ్ రంగుల్లో లభిస్తాయి. రియల్‌మీ పీ1 5జీ సిరీస్ ఫోన్లతోపాటు మార్కెట్‌లోకి వచ్చిన రియల్‌మీ బడ్స్ టీ110, పాడ్ వై-ఫై లు ఈ నెల 19 నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ ఇండియా వెబ్‌సైట్‌లలో కొనుక్కోవచ్చు.
రియల్ మీ పీ1 5జీ ఫీచర్లు ఇలా
120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 240 టచ్ శాంప్లింగ్ రేట్, 2400x1080 పిక్సెల్స్ రిజొల్యూషన్‌తోపాటు 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. రెయిన్ వాటర్ టచ్ ఫీచర్‌కు మద్దతుగా ఉండే రియల్‌మీ పీ1 5జీ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఎస్వోసీ చిప్‌సెట్ ఉంటది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియల్‌మీ యూఐ 5.0 ఓఎస్ వర్షన్‌పై పని చేస్తుంది. రెండు జనరేషన్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ అందిస్తామని రియల్‌మీ తెలిపింది. రియల్‌మీ పీ1 5జీ ఫోన్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ (50-మెగా పిక్సెల్స్ ప్రైమరీ సెన్సర్, 2-మెగా పిక్సెల్స్ డెప్త్ సెన్సర్ కెమెరా), సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 45వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీతో పని చేస్తుంది.
ఇలా రియల్‌మీ పీ1 ప్రో 5జీ ఫీచర్లు
రియల్‌మీ పీ1 ప్రో 5జీ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ఎస్వోసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ కర్వ్‌డ్ ఓలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 950 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ రేట్‌తోపాటు రెయిన్ వాటర్ టచ్ ఫీచర్ కూడా ఉంటది. డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ (50-మెగా పిక్సెల్ సోనీ ఎల్వైటీ-600 ప్రైమరీ రేర్ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 8-మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్ కెమెరా విత్ ఆల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ )తో వస్తుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటుంది.