Realme Narzo N65 5G | రియల్‌మీ నార్జో ఎన్65 5జీ ఫోన్ ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..?!
Realme Narzo N65 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ (Realme) తన రియల్‌మీ నార్జో ఎన్65 5జీ (Realme Narzo N65 5G) ఫోన్‌ను వచ్చేవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Realme Narzo N65 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ (Realme) తన రియల్‌మీ నార్జో ఎన్65 5జీ (Realme Narzo N65 5G) ఫోన్‌ను వచ్చేవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఆవిష్కరణ తేదీతోపాటు కీలక ఫీచర్లను రియల్‌మీ ప్రకటించింది. లార్జ్ రేర్ కెమెరా మాడ్యూల్‌తో వస్తోంది రియల్‌మీ నార్జో ఎన్65 5జీ ఫోన్. గతేడాది ఏప్రిల్‌లో మీడియాటెక్ హెలియో జీ88 చిప్‌సెట్, 64 -మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా సిస్టమ్‌తో ఆవిష్కరించిన రియల్‌మీ నార్జో ఎన్55 ఫోన్ కొనసాగింపుగా రియల్‌మీ నార్జో ఎన్65 5జీ (Realme Narzo N65 5G) ఫోన్ వస్తోంది.
రియల్‌మీ నార్జో ఎన్65 5జీ (Realme Narzo N65 5G) ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఈ నెల 28 మధ్యాహ్నం 12 గంటలకు ఆవిష్కరిస్తామని రియల్‌మీ ధృవీకరించింది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5జీ చిప్‌సెట్ (MediaTek Dimensity 6300 5G chipset), ఐపీ54 రేటింగ్ ఫర్ డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్, రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్ (Rainwater Smart Touch) కూడా ఉంటాయి. ఈ- కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ద్వారా సేల్స్ జరుగుతాయి.
గత నెల 26న భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన రియల్‌మీ సీ65 5జీ ఫోన్‌లో కూడా మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్వోసీ చిప్ సెట్ ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.10,499లకు లభించింది. రియల్‌మీ వెబ్‌సైట్‌తోపాటు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయించారు. ఈ ఫోన్ 6.67 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, ఏఐ బ్యాక్డ్ 50-మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 8- మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, 15 వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉన్నాయి.
రియల్‌మీ నార్జో ఎన్65 5జీ (Realme Narzo N65 5G) ఫోన్ రేర్‌లో లార్జ్ సర్క్యులర్ కెమెరా యూనిట్ జత చేశారు. ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తోపాటు రెండు కెమెరా సెన్సర్లు అమర్చారు. గ్లోషీ ఫినిష్‌తోపాటు గోల్డెన్ కలర్ ఆప్షన్‌తో ఈ ఫోన్ వస్తోంది. ఫోన్ కుడి వైపు పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ ఉంటాయి. రియల్‌మీ నార్జో ఎన్65 5జీ ఫోన్ 6.72- అంగుళాల ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 64- మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్, 8 -మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ మీడియాటెక్ హెలియో జీ88 ఎస్వోసీ ప్రాసెసర్, 33 వాట్ల సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉన్నాయి.