రియల్‌మీ నుంచి బడ్జెట్ ఫోన్! ఫీచర్లివే..
రియల్‌మీ నుంచి ‘రియల్‌మీ నార్జో ఎన్61 (Realme Narzo N61)’ పేరుతో ఓ మొబైల్ లాంఛ్ అయింది. ఇందులో మంచి కెమెరా, బ్యాటరీతోపాటు ఐపీ 54 రేటింగ్ కూడా ఉంది.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ పదివేల రూపాయల కంటే తక్కువ బడ్జెట్‌లో ఓ ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంఛ్ చేసింది. ఈ మొబైల్ ధర, స్పెసిఫికేషన్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రియల్‌మీ నుంచి ‘రియల్‌మీ నార్జో ఎన్61 (Realme Narzo N61)’ పేరుతో ఓ మొబైల్ లాంఛ్ అయింది. ఇందులో మంచి కెమెరా, బ్యాటరీతోపాటు ఐపీ 54 రేటింగ్ కూడా ఉంది. మరిన్ని వివరాల్లోకి వెళ్తే..
రియల్‌మీ నార్జో ఎన్61 మొబైల్ యూనిసోక్ టీ612 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియల్‌మీ యూఐ 4.0 వర్షన్ పై రన్ అవుతుంది. ఇందులో 6.74 అంగుళాల హెచ్డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 560 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. స్క్రీన్‌కు ఆర్మర్ షెల్ ప్రొటెక్షన్, హై రిలయబిలిటీ సర్టిఫికెట్ ఉన్నాయి.
రియల్‌మీ నార్జో ఎన్61.. కెమెరా, బ్యాటరీల విషయానికొస్తే ఇందులో 32 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్‌తోపాటు మరో సెకండరీ డెప్త్ సెన్సర్ ఉంటుంది. ముందువైపు 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అలాగే ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. అయితే ఇది కేవలం 10 వాట్ ఛార్జింగ్‌నే సపోర్ట్ చేస్తుంది. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది.
రియల్‌మీ నార్జో ఎన్61 మొబైల్ 4జీ సపోర్ట్‌తో వస్తుంది. అలాగే ఇందులో బ్లూటూత్5.0, వైఫై5 , ఐపీ 54 స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి ఫీచర్లున్నాయి. మొబైల్ బేసిక్ వేరియంట్ (4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ) ధర రూ.7,999 గా ఉంది. అలాగే 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.8,499 ఉంది. మార్బుల్ బ్లాక్, వొయేజ్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఆగస్టు 6 నుంచి సేల్‌కు అందుబాటులో ఉంటుంది.