Telugu Global
Science and Technology

రియల్‌మీ 13 సిరీస్ నుంచి రెండు కొత్త ఫోన్లు! ఫీచర్లివే..

రియల్‌మీ 13 ప్రో సిరీస్‌లో భాగంగా ‘రియల్‌మీ 13 ప్రో (Realme 13 Pro)’, ‘రియల్‌మీ13 ప్లస్‌ (Realme 13 Pro plus)’ అను రెండు ఫోన్లు ఇండియన్ మార్కెట్లో లాంఛ్ అయ్యాయి.

రియల్‌మీ 13 సిరీస్ నుంచి రెండు కొత్త ఫోన్లు! ఫీచర్లివే..
X

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ నుంచి రెండు ఫ్లాగ్‌షిప్ ఫోన్లు రిలీజయ్యాయి. మిడ్‌రేంజ్ బడ్జెట్లో అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో ఈ మొబైల్స్ లాంఛ్ అయ్యాయి. మొబైల్ ఫీచర్ల వివరాల్లోకి వెళ్తే..

రియల్‌మీ 13 ప్రో సిరీస్‌లో భాగంగా ‘రియల్‌మీ 13 ప్రో (Realme 13 Pro)’, ‘రియల్‌మీ13 ప్లస్‌ (Realme 13 Pro plus)’ అను రెండు ఫోన్లు ఇండియన్ మార్కెట్లో లాంఛ్ అయ్యాయి. ఈ ఫోన్లు స్నాప్‌డ్రాగన్‌ 7ఎస్‌ జెన్‌ 2 ప్రాసెసర్‌పై పనిచేస్తాయి. ఆండ్రాయిడ్‌ 14 బేస్డ్ రియల్‌మీ యూఐ 5.0తో పనిచేస్తాయి.

రియల్‌మీ 13 ప్రోమొబైల్‌లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుని సపోర్ట్ చేస్తుంది. ఇందులో 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 16 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సర్, ముందువైపు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటాయి. అలాగే ఇందులో 45వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. రియల్‌మీ 13 ప్రో బేస్ వేరియంట్ (8జీబీ ర్యామ్ విత్128జీబీ స్టోరేజ్) ధర రూ.23,999గా ఉంది. ఎమరాల్డ్ గ్రీన్, మోనెట్‌ పర్పుల్‌, మోనెట్ గోల్డ్ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది.

ఇక రియల్‌మీ 13 ప్రో ప్లస్‌ విషయానికొస్తే.. ఇందులో 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ కర్వ్‌డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంటుంది. ఇది ఇది 120హెర్ట్జ్ రిఫ్రెష్‌ రేటుని సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతోపాటు మరో 50 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సర్, 8 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సర్ ఉంటాయి. ముందువైపు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇందులో అమర్చిన 5200 ఎంఏహెచ్ బ్యాటరీ 80 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. రియల్‌మీ 13 ప్రో ప్లస్‌ మొబైల్ బేస్ వేరియంట్(8జీబీ ర్యామ్ విత్ 256జీబీ స్టోరేజ్) ధర రూ.29,999గా ఉంది. ఎమరాల్డ్ గ్రీన్, మోనెట్ గోల్డ్ కలర్స్‌లో లభిస్తుంది.

రెండు మొబైల్స్‌లో నైన్ లేయర్ కూలింగ్ సిస్టమ్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, స్టీరియో స్పీకర్లు, 5జీ కనెక్టివిటీ, బ్లూటూత్, వైఫై, ఏఐ ఆడియో జూమ్‌, ఏఐ స్మార్ట్‌ రిమూవల్‌ వంటి ఫీచర్లున్నాయి.

First Published:  1 Aug 2024 10:00 AM IST
Next Story