సునీతా విలియమ్స్‌కు ప్రధాని మోదీ లేఖ
భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు.. ప్రధాని మోదీ లేఖ రాశారు

భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు దేశ ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. భారత్‌లో పర్యటించాలని కోరారు. దాదాపు 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఎట్టకేలకు బుధవారం ఉదయం 3 గంటల తర్వాత భూమ్మీదకు చేరుకొనున్నారు. ఆ లేఖను కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రధాని మోదీ సునీతా విలియమ్స్‌కు రాసిన లేఖలో ‘సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమ్మీదకు చేరాలని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది.
ఆమె వేలమైళ్లు దూరంలో ఉన్నా.. మన హృదయాలకు దగ్గరగానే ఉన్నారు. ఆమె ఆరోగ్యం బాగుండాలని దేశ ప్రజలు ప్రార్థిస్తున్నారు’ అని గుర్తు చేశారు. అంతేకాదు, మోదీ తన అమెరికా పర్యటనలో గతేడాది జూన్ 5న అంతరిక్ష కేంద్రానికి వెళ్లి, ప్రతికూల పరిస్థితుల కారణంగా సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్‌లు అక్కడ చిక్కుకున్నారు. అప్పటి నుంచి ఆస్ట్రోనాట్స్‌ను భూమ్మీదకు తెచ్చేందుకు నాసా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆ ప్రయత్నాలతో పాటు ఆస్ట్రోనాట్స్ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు మాజీ అధ్యక్షుడు జోబైడెన్ వద్ద ఆరా తీసినట్లు లేఖలో తెలిపారు.