Nothing Phone 2a Special Edition | భారత్ మార్కెట్‌లోకి మీడియాటెక్ డైమెన్సిటీ 7200ప్రో ఎస్వోసీతో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్..!
Nothing Phone 2a Special Edition | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ నథింగ్ (Nothing) తన నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్ (Nothing Phone 2a Special Edition) ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Nothing Phone 2a Special Edition | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ నథింగ్ (Nothing) తన నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్ (Nothing Phone 2a Special Edition) ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. రెడ్, ఎల్లో, బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుందీ ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్‌తో వస్తున్న ఈ ఫోన్ జూన్ మొదటి వారంలో యూజర్లకు అందుబాటులో ఉంటుంది. డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తున్న నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్ (Nothing Phone 2a Special Edition) ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో ఎస్వోసీ (MediaTek Dimensity 7200 Pro SoC) ప్రాసెసర్‌పై పని చేస్తుంది.
నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్ (Nothing Phone 2a Special Edition) ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.27,999లకు లభిస్తుంది. లాంచింగ్ ఆఫర్ కింద రూ.1,000 డిస్కౌంట్‌తో రూ.26,999లకు సొంతం చేసుకోవచ్చు. జూన్ ఐదో తేదీ నుంచి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా పరిమిత సంఖ్యలో ఈ ఫోన్లను విక్రయిస్తున్నది నథింగ్. లండన్‌లోని నథింగ్ సోహో (Nothing Soho) స్టోర్ నుంచి జూన్ ఒకటో తేదీ ఉదయం 11 గంటల నుంచి కస్టమర్లు నేరుగా నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్ (Nothing Phone 2a Special Edition) ఫోన్ సొంతం చేసుకోవచ్చు. గత మార్చిలో ఆవిష్కరించిన స్టాండర్డ్ నథింగ్ ఫోన్ 2ఏ (Nothing Phone 2a) ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.23,999 లకే లభిస్తుంది.
నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్ (Nothing Phone 2a Special Edition) రెగ్యులర్ మోడల్ వైట్ కలర్ వేరియంట్ ఆధారంగా రూపుదిద్దుకున్నది. కానీ, రేర్ ప్యానెల్‌పై రెడ్, ఎల్లో, బ్లూ కలర్ అసెంట్స్ ఉంటాయి. నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్ (Nothing 2a Special Edition) డిజైన్ తమ బ్రాండ్ `స్టోరీ ఆఫ్ కలర్`గా నిలుస్తుందని పేర్కొంది. కెమెరా మాడ్యూల్ చుట్టూ, వెనక వైపు దిగువన గ్రే కలర్‌తో వస్తుంది. అన్ని రకాల నథింగ్ ఆడియో ప్రోడక్స్ రైట్ ఇయర్ బడ్‌ను ఎరుపుతో తయారు చేస్తోంది. తాజాగా నథింగ్ ఫోన్ 2ఏ ఫోన్ బ్లూ వర్షన్ ఫోన్ ఇయర్ బడ్స్ ఎల్లోవాడుతోంది. లండన్ కేంద్రంగా పని చేస్తున్న నథింగ్.. తొలిసారి సింగిల్ డివైజ్‌ను ఎరుపు, బ్లూ, ఎల్లో కలర్స్ ఆప్షన్లలో తీసుకొచ్చింది.
నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్ (Nothing Phone 2a Special Edition) ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+(1,080x2,412 పికల్సెల్స్) అమోలెడ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఒక్టారోక్ 4ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో ఎస్వోసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్ కెమెరా, 50-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ సెన్సర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్స్ కెమెరా ఉంటుంది. 256 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజీతోపాటు ఐపీ 54 రేటెడ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కెపాసిటీ కలిగి ఉంటుంది. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ లన్ లాక్ ఫీచర్‌తో వస్తోంది. 45వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది.