Moto G24 Power | మోటరోలా నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ మోటో జీ24 పవర్.. 30న లాంచింగ్.. ఇవీ డిటైల్స్..?!
Moto G24 Power | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా (Motorola) తన మోటో జీ24 పవర్ (Moto G24 Power) ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించేందుకు ముహూర్తం ఖరారైంది.
Moto G24 Power | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా (Motorola) తన మోటో జీ24 పవర్ (Moto G24 Power) ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించేందుకు ముహూర్తం ఖరారైంది. మోటరోలా తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా భారత్ మార్కెట్‌లో ఆవిష్కరణ తేదీతోపాటు డిజైన్, స్పెషిఫికేషన్స్ బయటపెట్టింది. గ్లాసియర్ బ్లూ, ఇంక్ బ్లూ షేడ్స్‌లో మోటో జీ24 (Moto G24 Power) ఫోన్ వస్తుంది.
మీడియాటెక్ హెలియో జీ85 ఎస్వోసీ (MediaTek Helio G85 SoC) చిప్‌సెట్, డ్యూయల్ రేర్ కెమెరా, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఇతర కీలక స్పెషిఫికేషన్స్ ఉంటాయి. ఈ-కామర్స్ జెయింట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఫోన్ విక్రయాలు జరుగుతాయి. ఈ నెల 30న భారత్ మార్కెట్‌లో మోటో జీ20 పవర్ (Moto G24 Power) ఆవిష్కరిస్తామని మోటరోలా తన ఎక్స్ ఖాతాలో ధృవీకరిస్తుంది. మోటరోలా ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైల్ స్టోర్లలో లభిస్తుంది.
మోటో జీ24 పవర్ (Moto G24 Power) ఫోన్ గ్లేసియర్ బ్లూ, ఇంక్ బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. ఆండ్రాయిడ్ 14 వర్షన్‌పై పని చేస్తుందీ ఫోన్. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో 6.56-అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. మీడియాటెక్ హెలియో జీ85 ఎస్వోసీ (MediaTek Helio G85 SoC) చిప్‌సెట్‌తో పని చేస్తుంది. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్‌గా మార్కెట్‌లోకి వస్తోంది.
డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్‌తో వస్తున్న మోటో జీ24 పవర్ (Moto G24 Power) ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా విత్ క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీ, 2-మెగా పిక్సెల్ మాక్రో సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16- మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటాయి. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, డోల్బీ ఆట్మోస్ మద్దతుతో స్టీరియో స్పీకర్లు ఉంటాయి. 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6,000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. మోటో జీ24 పవర్ (Moto G24 Power) ఫోన్ ధర వెల్లడించకున్నా, సుమారు రూ.10 వేల లోపే అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.