Telugu Global
Science and Technology

మీ బ్రౌజింగ్ భద్రమేనా?

ఆన్‌లైన్ మోసాల విషయంలో బ్రౌజింగ్ హిస్టరీ కీలక పాత్ర పోషిస్తుందని సైబర్ నిపుణులు చెప్తున్నారు.

మీ బ్రౌజింగ్ భద్రమేనా?
X

ఆన్‌లైన్ మోసాల విషయంలో బ్రౌజింగ్ హిస్టరీ కీలక పాత్ర పోషిస్తుందని సైబర్ నిపుణులు చెప్తున్నారు. సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేస్తున్నారు? గూగుల్, యూట్యూబ్‌ల్లో ఏం సెర్చ్ చేస్తున్నారు? వంటి వివరాల ద్వారానే సైబర్ నేరగాళ్లు.. వల వేస్తారట. అందుకే మోసగాళ్ల వలలో చిక్కకుండా ఉండేందుకు బ్రౌజింగ్‌ను సేఫ్‌గా చుకోవాలి. అదెలాగంటే..

ఆన్‌లైన్ యాక్టివిటీస్, బ్రౌజింగ్‌ హిస్టరీ ద్వారానే ఒక వ్యక్తి ఇష్టాలు, ప్రిఫరెన్సెస్ వంటివి తెలుస్తాయి. వాటిని బట్టి నేరగాళ్లు సరైన ప్లాన్ వేసి మోసాలు చేస్తుంటారు. ఉదాహరణకు లోన్స్ కోసం సెర్చ్ చేసేవాళ్లకు లోన్స్ పేరుతో కాల్స్ చేయడం, ఆన్‌లైన్‌లో ఏదైనా ప్రొడక్ట్ ఆర్డర్ చేసినట్టు తెలిస్తే.. డెలివరీ పేరుతో ఫేక్ కాల్స్ చేయడం ఇలా.. ఆన్‌లైన్ యాక్టివిటీస్ ద్వారా మోసగాళ్లు మన అవసరాల్ని అర్థం చేసుకుని తదనుగుణంగా మోసాలు చేస్తారు.

మీ బ్రౌజింగ్‌ సేఫ్‌గా ఉండాలంటే ముందుగా బ్రౌజర్ సెక్యూరిటీ చెక్ చేసుకోవాలి. బ్రౌజర్‌‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుండాలి. కుదిరితే బ్రౌజర్‌‌లో ఇంటర్నెట్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. బ్రౌజర్‌‌లో కుకీస్‌ లేదా థర్డ్‌ పార్టీ టూల్స్‌ను బ్లాక్ చేయాలి.

బ్రౌజర్స్‌లో గూగుల్ క్రోమ్, ఆర్‌ బ్రేవ్‌, డక్‌ డక్‌ గో, మొజిల్లా వంటివి సేఫ్ ఆప్షన్లు. వీటిలో యాంటీ వైరస్ లాంటి యాడ్‌ఆన్స్ అందుబాటులో ఉంటే వాటిని ఇన్‌స్టాల్ చేసుకోవడం ఉత్తమం.

వెబ్‌సైట్స్‌ నుంచి డౌన్‌లోడ్స్‌ చేసేటప్పుడు అది ట్రస్టెడ్ వెబ్‌సైట్ అవునా? కాదా? అన్నది నిర్ధారించుకోవాలి. అలాగే సైట్స్‌కు కెమెరా, మైక్రోఫోన్, లొకేషన్ వంటి పర్మిషన్లు ఇవ్వకుండా జాగ్రత్తపడాలి. వీడియో మీటింగ్స్ వంటి అవసరాలకు పర్మిషన్స్ ఇచ్చినా పని పూర్తయిన వెంటనే సెట్టింగ్స్‌లోకి వెళ్లి పర్మిషన్స్ ఆఫ్ చేయాలి.

ల్యాప్‌టాప్ లేదా పీసీలో విలువైన సమాచారం ఉన్నప్పుడు లేదా ఫైనాన్షియల్ యాక్టివిటీస్ వంటివి చేస్తున్నవాళ్లు తప్పనిసరిగా మంచి యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అవి ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ మాల్వేర్స్ నుంచి రియల్‌-టైమ్‌ ప్రొటెక్షన్‌ అందిస్తాయి.

సిస్టమ్‌ను ఇంకా భద్రంగా ఉంచుకోవాలనుకుంటే వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్స్‌ను వాడొచ్చు. ఇవి కాస్త ఖర్చుతో కూడుకుని ఉంటాయి. వీటిని వాడడం ద్వారా డేటాను మరింత సేఫ్‌గా ఉంచొచ్చు.

ఇవి కూడా..

ఇకపోతే వ్యక్తిగత వివరాలు ఎవ్వరికీ ఇవ్వకుండా, ఎలాంటి వెబ్‌సైట్స్‌లోఎంటర్ చేయకుండా జాగ్రత్తపడితే మంచిది.

ఇ–మెయిల్స్‌, సోషల్‌ మీడియా అకౌంట్స్‌కు ‘టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్’ ఎనేబుల్ చేసుకోవాలి.

బ్యాంకింగ్‌ వ్యవహారాల కోసం ఇన్‌కాగ్నిటో మోడ్ లేదా వీపీఎన్ బ్రౌజర్ వంటివి వాడితే మరింత సేఫ్‌గా ఉండొచ్చు.

సోషల్ మీడియా అకౌంట్స్‌ను ఎప్పటికప్పుడు లాగవుట్ చేస్తుండాలి. పర్సనల్ మొబైల్, ల్యాప్‌టాప్ అయినప్పటికీ.. ఎప్పటికప్పుడు లాగవుట్ చేస్తే ఇబ్బంది ఉండదు.

First Published:  9 Nov 2023 9:04 AM IST
Next Story