Telugu Global
Science and Technology

Infinix Note 40X | 108 మెగా పిక్సెల్స్ కెమెరాతో ఆగ‌స్టు 5న ఇన్‌ఫినిక్స్ నోట్ 40ఎక్స్ ఫోన్ ఆవిష్క‌ర‌ణ‌..!

Infinix Note 40X | ప్ర‌ముఖ స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ (Infinix) త‌న ఇన్‌ఫినిక్స్ నోట్ 40ఎక్స్ 5జీ (Infinix Note 40X) ఫోన్‌ను భార‌త్ మార్కెట్లో ఆగ‌స్టు ఐదో తేదీన ఆవిష్క‌రించ‌నున్న‌ది.

Infinix Note 40X | 108 మెగా పిక్సెల్స్ కెమెరాతో ఆగ‌స్టు 5న ఇన్‌ఫినిక్స్ నోట్ 40ఎక్స్ ఫోన్ ఆవిష్క‌ర‌ణ‌..!
X

Infinix Note 40X | 108 మెగా పిక్సెల్స్ కెమెరాతో ఆగ‌స్టు 5న ఇన్‌ఫినిక్స్ నోట్ 40ఎక్స్ ఫోన్ ఆవిష్క‌ర‌ణ‌..!

Infinix Note 40X | ప్ర‌ముఖ స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ (Infinix) త‌న ఇన్‌ఫినిక్స్ నోట్ 40ఎక్స్ 5జీ (Infinix Note 40X) ఫోన్‌ను భార‌త్ మార్కెట్లో ఆగ‌స్టు ఐదో తేదీన ఆవిష్క‌రించ‌నున్న‌ది. ఈ ఫోన్ 108 మెగా పిక్సెల్ రేర్ కెమెరాతో వ‌స్తోంది. కెమెరా సెట‌ప్‌తోపాటు, మెమోరీ కాన్ఫిగ‌రేష‌న్‌, డిస్‌ప్లే, డిజైన్ త‌దిత‌ర అంశాలు బ‌య‌ట‌కు లీక్ అయ్యాయి.

ఇన్‌ఫినిక్స్ నోట్ 40ఎక్స్ 5జీ (Infinix Note 40x 5G) ఫోన్‌ను ఆగ‌స్టు ఐదో తేదీన ఆవిష్క‌రించ‌నుండ‌టం ఖ‌రారైంది. ఇన్‌ఫినిక్స్ యూ-ట్యూబ్ చానెల్ ద్వారా లైవ్ స్ట్రీమ్ ప్ర‌సారం జ‌రుగుతుంది. స్పెషిఫికేష‌న్లు, ఇత‌ర వివ‌రాలు తెలుసుకుందాం..

డిజైన్: ఇన్‌ఫినిక్స్ నోట్ 40ఎక్స్ 5జీ ఫోన్ బ్లూ-యిష్ క‌ల‌ర్‌లో ఉంటుంది. సైడ్స్ ప్లాట్‌గా ఉండ‌టంతోపాటు మోడ్ర‌న్ ఐ-ఫోన్ కెమెరా త‌ర‌హా సెట‌ప్‌తో వ‌స్తోంది. 108 మెగా పిక్సెల్ `ఆల్ట్రా క్యామ్‌`తో కూడిన మెయిన్ సెన్స‌ర్ కెమెరాతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా ఉంటుంది. 2 మెగా పిక్సెల్ సెన్స‌ర్ కెమెరా, లైట్ సెన్స‌ర్‌తో కూడిన మూడో కెమెరా వ‌స్తోంది. క్వాడ్ ఎల్ఈడీ రింగ్ ఫ్లాష్‌తోపాటు 15+ కెమెరా మోడ్స్‌తో కూడిన బెనిఫిట్లు ఉంటాయి. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్స‌ర్ కెమెరా విత్ పంచ్ హోల్ క‌టౌట్ క‌లిగి ఉంటుంది.

12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ర్యామ్ స్టోరేజీతో వ‌స్తోంది ఇన్‌ఫినిక్స్ నోట్ 40ఎక్స్ 5జీ (Infinix Note 40X) ఫోన్‌. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.78 అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్ విత్ ఫుల్ హెచ్‌డీ + రిజొల్యూష‌న్ క‌లిగి ఉంటుంది. 18 వాట్ల చార్జింగ్ మ‌ద్ద‌తుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తోంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఎక్స్ఓఎస్ 14 ఓఎస్ వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుంది. డీటీఎస్ -ట్యూన్డ్ డ్యుయ‌ల్ స్పీక‌ర్లు, మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్‌, ఎన్ఎఫ్‌సీ, సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్ ఉంటాయి.

3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌, యూఎస్బీ-సీ పోర్ట్ క‌నెక్టివిటీ క‌లిగి ఉంటుంది. లైమ్‌ గ్రీన్‌, పామ్ బ్లూ, స్టార్‌లిట్ బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంది. గ‌త మే నెల‌లో ఇన్‌ఫినిక్స్ నోట్ 40 5జీ ఫోన్‌ను మీడియాటెక్ డైమెన్సిటీ 7020 డైమెన్సిటీ ప్రాసెస‌ర్‌తో మార్కెట్లో విడుద‌ల చేసింది. ఇన్‌ఫినిక్స్ నోట్ 40 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.19,999 నుంచి ప్రారంభ‌మైంది. ఇక ఇన్‌ఫినిక్స్ నోట్ 40ఎక్స్ 5జీ ఫోన్ ప‌లు అప్‌గ్రేడ్స్‌తో వ‌స్తోంది. ఈ ఫోన్ ధ‌ర సుమారు రూ.10 వేల లోపు ఉండొచ్చున‌ని అంచ‌నా వేస్తున్నారు.

First Published:  25 July 2024 11:19 AM IST
Next Story