టెలిగ్రామ్ ఎలా వాడాలి? ఎలా వాడకూడదో తెలుసా?
How to use Telegram: వాట్సాప్ తర్వాత ఎక్కువ పాపులారిటీ పొందిన మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్. ఇదొక క్రాస్–ప్లాట్‌ఫామ్. ఇందులో మెసేజింగ్‌తో పాటు ఇతర సేవలు కూడా పొందొచ్చు.
వాట్సాప్ తర్వాత ఎక్కువ పాపులారిటీ పొందిన మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్. ఇదొక క్రాస్–ప్లాట్‌ఫామ్. ఇందులో మెసేజింగ్‌తో పాటు ఇతర సేవలు కూడా పొందొచ్చు. అయితే ఈ యాప్ కుండే వెసులుబాట్ల కారణంగా ఇది కొన్ని ఫేక్ కార్యకలాపాలకు కూడా అడ్డాగా మారింది. టెలిగ్రామ్‌లో కొన్ని వేల మంది మెంబర్స్‌తో గ్రూప్స్ క్రియేట్ చేస్తుంటారు. దీంతో ఇదొక మార్కెటింగ్ హబ్‌గా మారింది. అసలు టెలిగ్రామ్ ఎలా వాడాలి? ఎలా వాడకూడదు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వాట్సాప్ గ్రూప్‌లలో 256 మంది సభ్యులకు మాత్రమే అవకాశం ఉంది. కానీ, టెలిగ్రామ్‌లో రెండు లక్షల మంది ఒక గ్రూప్‌గా ఏర్పడొచ్చు. టెలిగ్రామ్ కూడా వాట్సాప్ లాగానే చాట్ మెసేజ్‌లను ఎన్‌క్రిప్ట్ చేస్తుంది. ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే టెలిగ్రామ్‌లో స్కామ్స్‌కు ఎక్కువ అవకాశం ఉంది. గ్రూపుల్లో వచ్చే రకరకాల లింక్‌లు ఓపెన్ చేయడం వల్ల థర్డ్ పార్టీ వెబ్‌సైట్లలోకి లాగిన్ అవ్వాల్సి వస్తుంది. ఇవి మాల్వేర్ లేదా సైబర్ ఎటాక్స్‌కు దారితీయొచ్చు.
ఇకపోతే స్కామర్లు ఫేక్ టెలిగ్రామ్ ఛానెల్స్ క్రియేట్ చేసి సేల్స్, డిస్కౌంట్ల పేర్లతో డూప్లికేట్ షాపింగ్ సైట్స్ లింక్స్ పంపిస్తుంటారు. ఆ లింక్స్ క్లిక్ చేయడం ద్వారా ప్రైవసీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఫేక్ ఈ కామర్స్ సైట్స్‌లో షాపింగ్ చేస్తే.. క్రెడిట్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ హ్యాక్ అయ్యే అవకాశం ఉంది.
ఇకపోతే బిట్‌కాయిన్, క్రిప్టో కరెన్సీ స్కామ్‌లు కూడా టెలిగ్రామ్‌లోనే ఎక్కువగా జరుగుతుంటాయి. స్కామర్లు తమను తాము క్రిప్టో కరెన్సీ ఎక్స్‌పర్ట్స్‌గా చెప్పుకుంటూ, యూజర్లను క్రిప్టోలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తుంటారు. అందుకే ఇలాంటి గ్రూపులకు దూరంగా ఉండడం మంచిది.
సోషల్ మీడియాలో బ్యాన్ అయిన అశ్లీల విడియోలు, సినిమా పైరసీ లాంటివి కూడా టెలిగ్రామ్ యాప్‌లో కనిపిస్తుంటాయి. అలాంటి గ్రూప్స్‌లో జాయిన్ అయితే రకరకాల లింక్‌లు కనిపిస్తాయి. వాటిని క్లిక్ చేయడం ద్వారా మొబైల్‌లోకి మాల్వేర్ ఎంటర్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
ఏదేమైనా ఫ్రెండ్స్‌తో ఛాట్ చేయడానికి, వెరిఫైడ్ అకౌంట్స్, గ్రూపులతో కనెక్టెడ్‌గా ఉండడానికి టెలిగ్రామ్ యాప్ బాగా పనికొస్తుంది. టెలిగ్రామ్‌లోని రకరకాల గ్రూపుల్లో చేరి పర్సనల్ డేటా, బ్యాంక్ అకౌంట్ వివరాలు లాంటివి ఎంటర్ చేస్తే మాత్రం మోసపోక తప్పదు. ఏదైనా లింక్ ఓపెన్ చేసే ముందు దాన్ని కాపీ చేసి 'యూఆర్ఎల్ వాయిడ్ (urlvoid.com)' అనే వెబ్‌సైట్ ద్వారా లింక్‌ను చెక్ చేసి తర్వాత ఓపెన్ చేయడం బెటర్.
ఫేక్ అకౌంట్లను గుర్తించినప్పుడు ఆ అకౌంట్‌ను రిపోర్ట్ చేసి బ్లాక్ చేయాలి. స్కామ్ జరిగినప్పుడు ఆయా గ్రూపులు, ఛాటింగ్‌ల వివరాలను స్క్రీన్‌షాట్ తీసి టెలిగ్రామ్‌కి ఇమెయిల్(abuse@ telegram.org)చేయొచ్చు.