ఫోన్ స్పీడ్ పెరగాలంటే ఇలా చేయాలి!
మొబైల్ తరచుగా స్లో అవుతుందంటే దానికి కారణం ర్యామ్, స్టోరేజీ నిండిపోతూ ఉండడమే. అందుకే ఫోన్ స్పీడ్ తగ్గిపోతుంటే ఎప్పటికప్పుడు జంక్ క్లీన్ చేస్తుండాలి.
మొబైల్ తరచుగా స్లో అవుతుందంటే దానికి కారణం ర్యామ్, స్టోరేజీ నిండిపోతూ ఉండడమే. అందుకే ఫోన్ స్పీడ్ తగ్గిపోతుంటే ఎప్పటికప్పుడు జంక్ క్లీన్ చేస్తుండాలి. అదెలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
మొబైల్ ఒక రోజులో చాలా పనులు చేస్తుంటుంది. రకరకాల యాప్స్ డేటాను యాక్సెస్ చేయడమే కాకుండా యాప్స్‌కు సంబంధించిన క్యాచీ, కుకీస్ ను కూడా స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. ఇలాంటి వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తుంటే మొబైల్ స్పీడ్‌గా పనిచేయడంతో పాటు బ్యాటరీ కూడా ఎక్కువసేపు వస్తుంది.
మొబైల్‌లోని క్యాచీని క్లియర్ చేయడం కోసం క్లీనర్ అనే యాప్ డీఫాల్ట్‌గా ఉండనే ఉంటుంది. అది కాకుండా సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాప్స్ స్టోరేజీని క్లియర్ చేస్తే మరింత స్టోరేజీ క్లీన్ అవుతుంది. దీనికోసం సెట్టింగ్స్‌లో ‘యాప్స్’లోకి వెళ్లి తరచుగా వాడే యాప్స్‌ను ఒక్కోటిగా సెలక్ట్ చేసి ‘స్టోరేజీ’ ఆప్షన్‌లో ‘క్లియర్ క్యాచీ’పై నొక్కాలి. ఇలా చేయడం వల్ల యాప్స్ అదనంగా స్టోర్ చేసుకున్న జంక్ డేటా అంతా క్లియర్ అవుతుంది.
యాప్స్‌లోని క్యాచీ మొబైల్ స్లో అయ్యేలా చేస్తే.. బ్రౌజర్‌లోని క్యాచీ మాత్రం మీ ప్రైవసీనే రిస్క్‌లో పెడుతుంది. కాబట్టి మొబైల్ బ్రౌజర్‌లోని క్యాచీని తరచూ క్లీన్ చేయడం చాలా ముఖ్యం. మీరు విజిట్ చేసే సైట్స్, లాగిన్ వివరాలు ఇలా.. మీ డేటా అంతా టెంపరరీ స్టోరేజీ కింద క్యాచీలుగా సేవ్ అవుతుంది. దీన్ని క్లియర్ చేయడం కోసం వెబ్ బ్రౌజర్‌లోకి వెళ్లి అక్కడ మెనూలో ‘హిస్టరీ’ మీద క్లిక్ చేసి ‘డిలీట్ బ్రౌజింగ్ డేటా’ నొక్కాలి. అలాగే అడ్వాన్స్‌డ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి కుకీస్, సైట్ డేటా, క్యాచీ వంటివి కూడా డిలీట్ చేసేయాలి.
మొబైల్ యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో డేటాను వాడుకోవడం వల్ల మొబైల్ స్పీడ్‌తోపాటు ఇంటర్నెట్ స్పీడ్ కూడా తగ్గుతుంది. దీన్ని మార్చాలంటే సెట్టింగ్స్‌లో ‘యాప్స్’లోకి వెళ్లి ఒక్కో యాప్‌పై క్లిక్ చేసి ఆప్షన్స్‌లో ‘మొబైల్ డేటా అండ్ వైఫై’పై క్లిక్ చేయాలి. అక్కడ ‘బ్యాక్‌గ్రౌండ్ డేటా’ అని ఉంటుంది. అవసరం లేదనుకున్న యాప్స్‌కు ఆ ఆప్షన్ డిజేబుల్ చేయాలి. ఇలా చేస్తే ఇంటర్నెట్ సేవ్ అవ్వడంతోపాటు మొబైల్ స్పీడ్ కూడా పెరుగుతుంది.