Telugu Global
Science and Technology

ఇంపార్టెంట్ ఫైల్స్ డిలీట్ అయితే..

ముఖ్యమైన ఫైల్స్ డిలీట్ అయితే ఎక్కడలేని టెన్షన్ వస్తుంది. పోయిన ఫైళ్లు ఇక రావేమో అనుకుంటారు చాలామంది. అయితే డిలీట్ అయిన ఫైళ్లను తిరిగి పొందేందుకు కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి.

How to Recover Deleted Files
X

ఇంపార్టెంట్ ఫైల్స్ డిలీట్ అయితే..

ముఖ్యమైన ఫైల్స్, డాక్యుమెంట్స్, ఫొటోల వంటివన్నీ మొబైల్‌లో కాకుండా ల్యాప్‌టాప్ లేదా పీసీలో దాచుకుంటారు చాలామంది. అయితే ఒకవేళ పొరపాటున అవి డిలీట్ అయితే అప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం..

ముఖ్యమైన ఫైల్స్ డిలీట్ అయితే ఎక్కడలేని టెన్షన్ వస్తుంది. పోయిన ఫైళ్లు ఇక రావేమో అనుకుంటారు చాలామంది. అయితే డిలీట్ అయిన ఫైళ్లను తిరిగి పొందేందుకు కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. వాటి సాయంతో పోయిన ప్రతీ ఫైల్‌ను తిరిగి పొందొచ్చు.

ఫైల్స్ డిలీట్ అయ్యాయి అని తెలిసినప్పుడు వాటిని బ్యాకప్‌గా ఎక్కడైనా ‘సేవ్ యాజ్’ చేశారేమో చెక్ చేసుకోవాలి. ఫైల్ నేమ్ గుర్తు ఉంటే లోకల్ డ్రైవ్స్‌లో సెర్చ్ చేసి చూడాలి. లేదా మొత్తం పీసీని సెర్చ్ చేసి చూడాలి. అలాగే రీసైకిల్ బిన్‌ను కూడా ఒకసారి చెక్ చేయాలి. అక్కడ ఉంటే వాటిని రీస్టో్ర్ చేయాలి. ఫైల్స్ ఎక్కడా లేవు, పూర్తిగా డిలీట్ అయ్యాయి అని కన్ఫర్మ్ అయితే..రెకువా(recuva), ఈజ్ అజ్(easeUS),డిస్క్ డ్రిల్(diskdrill) లాంటి సాఫ్ట్ వేర్స్ సాయం తీసుకోవచ్చు. ఇవి పీసీలో ఇప్పటివరకూ డిలీట్ అయిన అన్ని ఫైల్స్‌ను తిరిగి రికవర్ చేయగలవు.

వీటిలో ఒక సాఫ్ట్‌వేర్‌‌ను ఇన్‌స్టాల్ చేసి పీసీ మొత్తాన్ని స్కాన్ చేస్తే.. ఆయా డ్రైవ్స్‌లో డిలీట్ అయిన ఫైల్స్ అన్నీ కనిపిస్తాయి. వాటిలో కావాల్సిన ఫైల్స్‌ను సెలక్ట్ చేసుకుని రికవర్ బటన్ నొక్కితే పోయిన ఫైల్స్ తిరిగి రికవర్ అవుతాయి.

First Published:  17 March 2023 12:22 PM IST
Next Story