ఇన్‌స్టాగ్రామ్‌లో పాపులర్ అవ్వాలా? ఇలా చేయండి!
Popular on Instagram | ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఇన్‌స్టాగ్రామ్ టాప్‌లో ఉంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ అందరూ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటున్నారు.
ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఇన్‌స్టాగ్రామ్ టాప్‌లో ఉంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ అందరూ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటున్నారు. సొంతంగా బ్రాండింగ్ చేసుకునేందుకు ఇన్‌స్టాగ్రామ్ మంచి ప్లాట్‌ఫామ్. అయితే ఇన్‌ఫ్లుయెన్సర్లగా మారడానికి, ఫాలోవర్ల సంఖ్యను పెంచుకోవడానికి కొన్ని బేసిక్ టిప్స్ పాటించాలి. అవేంటంటే..
ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అవ్వాలనుకునేవాళ్లు ముందుగా ఏ కేటగిరీలో పాపులర్ అవ్వాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. మీరు ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేయగలరు? దానికి ఉన్న స్కోప్ ఎంత? అనేది తెలుసుకోవాలి. ఇన్‌ఫ్లుయెన్సర్లుగా మారాలనుకునేవాళ్లు కంటెంట్ ద్వారా ఎంటర్‌టైన్ అయినా చేయగలగాలి లేదా కొత్త ఇన్ఫర్మేషన్‌తో ఎడ్యుకేట్ అయినా చేయాలి. రెండూ చేయగలిగితే ఇంకా మంచిది.
ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారేందుకు ముందుగా క్యాచీ టైటిల్ అవసరం. యూజర్ నేమ్ సింపుల్‌గా కాకుండా కాస్త యునిక్‌గా ఆలోచించాలి. అది మీ కంటెంట్‌ను రిప్రజెంట్ చేసేవిధంగా ఉండాలి.
ఇన్‌స్టాగ్రామ్‌లో త్వరగా రీచ్ పొందేందుకు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్స్‌పై కంటెంట్ క్రియేట్ చేయాలి. ఏయే హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయో తెలుసుకుని ఎప్పటికప్పుడు రిలేటెడ్ కంటెంట్ పోస్ట్ చేస్తుండాలి. ఇన్‌స్టాగ్రామ్‌ను ఫేస్‌బుక్, ట్విటర్ వంటి ఇతర ప్లాట్‌ఫామ్స్‌తో లింక్ చేసి ప్రమోట్ చేసుకుంటుండాలి.
ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల విషయంలో పంక్చువాలిటీ మెయింటెయిన్ చేయాలి. క్రమం తప్పకుండా పోస్టులు పెడుతుండాలి. పోస్టుల మధ్య ఎక్కువ గ్యాప్ ఉంటే రీచ్ తగ్గుతుంది. అలాగే యూజర్లు యాక్టివ్‌గా ఉండే వీకెండ్స్‌లో , ఈవెనింగ్ టైమ్స్‌లో ఎక్కువ పోస్టులు చేయాలి. పోస్టులతో పాటు రీల్స్, స్టోరీలు, పోల్స్, క్వశ్చన్స్ వంటివి కూడా పెడుతుండాలి.
ఫాలోవర్లను త్వరగా పెంచుకునేందుకు ఇతర కంటెంట్ క్రియేటర్లతో కలిసి పనిచేయొచ్చు. తోటి క్రియేటర్లతో కలిసి పోస్ట్కలు, రీల్స్ షేర్ చేసుకోవడం ద్వారా వాళ్ల ఫాలోవర్లు మిమ్మల్ని కూడా ఫాలో అయ్యే వీలుంటుంది.
నకిలీ మార్గాల ద్వారా ఫేక్ ఫాలోవర్స్‌ను పెంచుకోవడం, ఏజెన్సీల ద్వారా పోస్టుల రీచ్‌ను పెంచుకోవడం వంటివి లాంగ్ టర్మ్‌లో పనిచేయవు. పైగా మోసాల బారిన పడే అవకాశం ఉంటుంది.
ఇకపోతే ఫాలోవర్స్ అనేవాళ్లు మీ కంటెంట్‌ను నచ్చి మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ల ఫీడ్‌బ్యాక్ తీసుకుంటుండాలి. అప్పుడప్పుడు లైవ్ చాట్ వంటివి నిర్వహిస్తూ వాళ్లతో కనెక్టెడ్‌గా ఉండాలి.