ఏఐ సాఫ్ట్‌వేర్ డెవలపర్ ‘డెవిన్’! దీంతో ఉద్యోగాలకు ముప్పు ఉందా?
ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ‘డెవిన్’ ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతుంది.
రోజురోజుకీ అప్‌డేట్ అవుతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో ప్రస్తుతం ఓ కీలక డెవలప్‌మెంట్ వచ్చింది. అదే ‘డెవిన్’. ఇది ప్రపంచంలోని మొదటి ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. దీని ప్రత్యేకతలేంటంటే.
ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ‘డెవిన్’ ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతుంది. ఎలాంటి ప్రోగ్రామ్‌నైనా చిటికెలో రాసి ఇవ్వగల ఈ టూల్.. సాఫ్ట్‌వేర్ డెవలపర్లకు ధీటుగా నిలువనుంది. దీన్ని కాగ్నిషన్ అనే కంపెనీ రూపొందించింది. అయితే ఈ టూల్ రాబోయే రోజుల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఆల్టర్నేటివ్ కానుందా అన్న భయాలు కూడా కొందరిలో మొదలయ్యాయి. దీనిపై టూల్ డెవలపర్లు ఏమంటున్నారంటే.
డెవిన్ టూల్.. ప్రాంప్ట్ సాయంతో కోడింగ్, ప్రోగ్రామింగ్ వంటి పనులు చేసేయగలదు. ప్రాంప్ట్ ఇస్తే.. వెబ్‌సైట్ క్రియేట్ చేస్తుంది. సాఫ్ట్‌వేర్, యాప్స్ వంటివి కూడా డెవలప్ చేస్తుంది. అంతేకాదు, ప్రోగ్రామింగ్‌లో వచ్చే ఎర్రర్స్ కనిపెట్టడం, వాటిని సరిచేయడం వంటి పనులు కూడా సునాయాసంగా చేసేస్తుంది. అయితే దీన్ని మనుషులకు ప్రత్యామ్నాయంగా తయారుచేయలేదని కంపెనీ అంటోంది. కేవలం డెవలరపర్లకు కోడింగ్ సపోర్ట్ ఇచ్చేందుకే ఈ టూల్ క్రియేట్ చేసినట్టు కాగ్నిషన్ కంపెనీ పేర్కొంది.
డెవిన్ టూల్.. సాఫ్ట్‌వేర్ డెవలపర్లకు చాలా సమయాన్ని సేవ్ చేస్తుంది. వారికి తగిన సపోర్ట్ ఇస్తూ, ప్రోగ్రామ్స్ పై రియల్ టైమ్ అప్‌డేట్స్ అందిస్తుంది. అలాగే ఇది కొత్త టెక్నాలజీలను నేర్చుకోగలదు, యాప్‌లను క్రియేట్ చేయగలదు, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్‌లో వచ్చే బగ్స్ ను చిటికెలో గుర్తించి వాటిని సరిచేయగలదు. ఎంతో సంక్లిష్టమైన కోడ్స్‌ను కూడా ఇది సెకన్లలో పూర్తి చేస్తుంది. సాఫ్ట్‌వేర్ డెవలపర్లకు కావాల్సిన టూల్స్, ఎడిటర్స్ వంటివాటిని కూడా క్రియేట్ చేయగలదు.
ఇదిలాఉంటే రాబోయే రోజుల్లో డెవిన్ లాంటి పలు ఏఐ సాఫ్ట్ వేర్ డెవలపింగ్ టూల్స్ అందుబాటులోకి రావొచ్చని.. దాంతో సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో కొత్త శకం మొదలవుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం ఇలాంటి టూల్స్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో సపోర్ట్ టీం అవసరాన్ని తగ్గిస్తాయని అంటున్నారు.