Telugu Global
Science and Technology

క్యాలెండర్ ఎలా పుట్టిందో తెలుసా?

ప్రతి సంవత్సరం పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే వాటిల్లో మొదటిది క్యాలెండర్‌. ఆ క్యాలెండర్‌ ఎప్పుడు ప్రారంభమైంది.

క్యాలెండర్ ఎలా పుట్టిందో తెలుసా?
X

ప్రతి సంవత్సరం పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే వాటిల్లో మొదటిది క్యాలెండర్‌. ఆ క్యాలెండర్‌ ఎప్పుడు ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా వాడుతున్న క్యాలెండర్‌ పేరేమిటి? వంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

-క్యాలెండర్ అనే పది లాటిన్‌ భాష నుంచి పుట్టింది. లాటిన్‌లో ‘క్యాలెండేరియమ్‌’ అంటే అకౌంట్‌ బుక్‌ అని అర్థం. అలాగే క్యాలెండా అంటే సంవత్సరంలో వచ్చే మొదటి రోజు అని అర్థం. అలా లాటిన్‌ పదానికి దగ్గరగా ఉండే అర్థం నుంచి క్యాలెండర్‌ అనే పేరుని పెట్టారు.

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న క్యాలెండర్‌.. గ్ర్రెగోరియన్‌ క్యాలెండర్‌. రోమ్‌ మొట్టమొదటి రాజు సంవత్సరానికి 300 రోజులను మాత్రమే పరిగణించి పది నెలలు ఉండే క్యాలెండర్‌ని తయారుచేశారట. దీంతో పంటలు వేయడానికీ, పండగలు చేసుకోవడానికి ఎంతో ఇబ్బంది పడేవారట. తర్వాత నుమా పొంపిలుయస్‌ అనే రాజు 365 రోజులను పరిగణనలోకి తీసుకుని జనవరి, ఫిబ్రవరిని ఈ క్యాలెండర్‌లో కలిపారట.-

క్రీ.శ.1582లో కొన్ని దేశాలు మినహాయించి ప్రపంచవ్యాప్తంగా గ్రెగోరియన్‌ క్యాలెండర్‌ని అంగీకరించారట.- ఆ తరువాత 1873లో జపాన్‌ , 1917లో రష్యా , 1949లో చైనా ఇలా ప్రపంచమంతా గ్రెగోరియన్‌ క్యాలెండర్‌ని అంగీకరించడం మొదలుపెట్టింది.

ప్రపంచవ్యాప్తంగా సూర్యమానం ఆధారంగా చేసుకుని నలభైకి పైబడే క్యాలెండర్లున్నాయి. అందులో ఈజిప్టు, మెసపటోమియా, ఇథియోపియన్‌, హీబ్రూ, చైనీస్‌, రోమన్‌, జూలియన్‌, మయన్‌, గ్రెగోరియన్‌ వాడుకులోకి వచ్చినవి.

అనేక ముఖ్యమైన రోజులున్న క్యాలెండర్‌లో 365 రోజుల్లో ఏ ఒక్క రోజు క్యాలెండర్‌ డే అనేది లేకపోవడం విచిత్రం.

సాధారణంగా క్యాలెండర్స్ తయారుచేసేవాళ్లు ఒక్కో నెలకు సంబంధించిన అంశాన్ని తీసుకుని ఒక్కో ఫోటోని పెడతారు. కానీ క్యాలెండర్‌ క్లబ్‌ ఆఫ్‌ కెనడా వారు క్యాలెండర్‌ ఫన్నీగా ఉండేందుకు వినూత్నంగా తయారు చేస్తున్నారు. మనం ముందుగా ఫోన్‌ చేసి మన ఇంట్లో ఏ వయస్సు వారున్నారో చెబితే వారికి తగ్గట్టుగా ఫన్నీ పిక్చర్స్‌తో చేస్తారట. బహుమతిగా ఇవ్వాలన్నా ముందుగా చెబితే చేస్తారు.

First Published:  31 Dec 2023 8:45 AM IST
Next Story