Telugu Global
Sankranthi Essay

కిషన్‌రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడులకు హాజరైన ప్రధాని మోడీ

ఈ వేడుకల్లో పాల్గొన్న స్పీకర్‌ ఓం బిర్ల, కేంద్ర మంత్రి, భూతిరాజు శ్రీనివాసరాజు, మెగాస్టార్‌ చిరంజీవి

కిషన్‌రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడులకు హాజరైన ప్రధాని మోడీ
X

ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో సోమవారం సాయంత్రం సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ వేడుకల్లో స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర మంత్రి భూతిరాజు శ్రీనివాసరాజు, సిటీ నటుడు చిరంజీవి, ఏఐజీ ఆస్పత్రి ఛైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి, పీవీ సింధుతో పాటు వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతి కార్యక్రమాలను మోడీ వీక్షించారు. గాయని సునీత పాటలతో అలరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి వేంకటేశ్వర స్వామి ప్రతిమను కిషన్‌రెడ్డి అందజేశారు.

First Published:  13 Jan 2025 8:26 PM IST
Next Story