Telugu Global
Sankranthi Essay

బ్రాహ్మణికి నారా లోకేశ్‌ సంక్రాంతి స్పెషల్‌ గిఫ్ట్‌

మంగళగిరి చేనేత చీర చాలా ప్రత్యేకంగా ఉన్నదని చెబుతూ.. లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపిన బ్రాహ్మణి

బ్రాహ్మణికి నారా లోకేశ్‌ సంక్రాంతి స్పెషల్‌ గిఫ్ట్‌
X

ఏపీ మంత్రి నారా లోకేశ్‌ తన సతీమణి బ్రాహ్మణికి సంక్రాంతి వేడుకల సందర్భంగా మంగళగిరిలో తయారుచేసిన చేనేత చీరను బహుమతిగా ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇక్కడి చేనేత కార్మికుల నైపుణ్యం అద్భతమైందని కొనియాడారు. ప్రతి ఒక్కరూ వారికి మద్దతు ఇచ్చి చేనేతను ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలని కోరారు. ఈ పోస్టును నారా బ్రాహ్మణి రో పోస్ట్‌ చేశారు. మంగళగిరి చేనేత చీర చాలా ప్రత్యేకంగా ఉన్నదని చెబుతూ.. లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గొప్ప నైపుణ్యంతో తీర్చిదిద్దిన చేనేత చీరను తీసుకోవడం సంతోషాన్నిచ్చిందని చెప్పారు.

కనుమ.. అన్ని ప్రయత్నాల్లో విజయాన్ని, ఆనందాన్ని తీసుకురావాలి

తెలుగు ప్రజలకు ఏపీ మంత్రి లోకేశ్‌ కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుల అన్నదాతలకు అత్యంత ప్రీతిపాత్రమైందని చెప్పారు. రైతన్నలు ఏడాది పొడవునా తమ కష్టంలో పాలుపంచుకునే పశువులను పూజించే పర్వదినం ఇది. అన్నదాతల ఇల్లు ధాన్యరాశులతో నిండుగా, పాడిపంటలతో పచ్చగా.. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. కనుమ.. అన్ని ప్రయత్నాల్లో విజయాన్ని, ఆనందాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాని లోకేశ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

First Published:  15 Jan 2025 8:33 AM IST
Next Story