Telugu Global
Sankranthi Essay

భోగి వేడుకల్లో కేటీఆర్‌, హరీశ్‌ రావు

ఎమ్మెల్యే నగర్‌ ఎమ్మెల్యే నివాసంలో అట్టహాసంగా ఉత్సవాలు

భోగి వేడుకల్లో కేటీఆర్‌, హరీశ్‌ రావు
X





భోగి వేడుకల్లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌ రావు పాల్గొన్నారు. ఎల్‌బీ నగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి సోమవారం తన నివాసంలో అట్టహాసంగా భోగి పండుగ నిర్వహించారు. కేటీఆర్‌, హరీశ్‌ రావుతో కలిసి ఆయన భోగి మంటను వెలగించారు. హరిదాసులకు నిత్యావసరాలు వితరణ చేశారు. ఈ సందర్భంగా గంగిరెద్దుల విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్‌, కాలేరు వెంకటేశ్‌, పాడి కౌశిక్‌ రెడ్డి, బాండారి లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌, పటోళ్ల కార్తీక్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





First Published:  13 Jan 2025 10:42 AM IST
Next Story