Telugu Global
Sankranthi Essay

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భోగి వేడుకలు

పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు, చిన్నారులు

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భోగి వేడుకలు
X





తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సోమవారం తెల్లవారుజామున కేబీఆర్‌ పార్క్‌ వద్ద భోగి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భోగి మంటలను వెలగించారు. మంటల చుట్టూ యువతులు, మహిళలు ఆడిపాడారు. చిన్నారులకు భోగిపళ్లు పోశారు. హరిదాసులకు బియ్యం, ఇతర నిత్యావసరాలు వితరణ చేశారు. గంగిరెద్దుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పతంగులు ఎగరవేసి సంబరాలు చేసుకున్నారు.





First Published:  13 Jan 2025 9:24 AM IST
Next Story