Telugu Global
Sankranthi Essay

సంక్రాంతికి 6,432 ప్రత్యేక బస్సులు

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు : మంత్రి పొన్నం ప్రభాకర్‌

సంక్రాంతికి 6,432 ప్రత్యేక బస్సులు
X

సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ 6,432 ప్రత్యేక బస్సులు నడుపుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. శుక్రవారం నుంచే ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రారంభించామన్నారు. ప్రయాణికుల కోసం మరిన్ని బస్సులు నడిపేందుకు కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళల కోసం అదనపు బస్సులు నడిపించాలని, ఎక్కడా ఇబ్బందులు కలుగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యాజమాన్యాలు పండుగ పూట అదనపు చార్జీల పేరుతో ప్రజలు దోపిడీ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ప్రస్తుతం ఉన్న చార్జీలు మాత్రమే వసూలు చేయాలని, అంతకుమించి వసూలు చేసినట్టు తేలితే బస్సులు సీజ్‌ చేస్తామని తేల్చిచెప్పారు. అధికారులు ఫీల్డ్‌ లోనే ఉండి నిరంతరం తనిఖీలు చేయాలని, ఎక్కడ ఎలాంటి ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించాలన్నారు.

First Published:  10 Jan 2025 3:34 PM IST
Next Story