Telugu Global
Telangana

మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిని ఓడించాలి

దేశంలో రెండు వర్గాలే ఉన్నాయని ఒకటి మోదీ వర్గం.. మరొకటి గాంధీ వర్గం అన్న సీఎం రేవంత్‌

మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిని ఓడించాలి
X

మైనారిటీ సంక్షేమం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తున్నదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

మెజారిటీ, మైనారిటీ ఇద్దరూ ప్రభుత్వానికి రెండు కళ్ల లాంటి వాళ్లు. స్వాంతంత్య్రం రాగానే మౌలానా అబుల్‌ కలామ్‌ను నెహ్రూ విద్యాశాఖ మంత్రిగా చేశారు. విద్యా వ్యవస్థలో మౌలానా అబుల్‌ కలామ్‌ అనేక విధానాలు తెచ్చారు. దేశంలో రెండు వర్గాలే ఉన్నాయని ఒకటి మోదీ వర్గం.. మరొకటి గాంధీ వర్గం అన్నారు. హిందు ముస్లిం భాయి భాయి అన్నదే కాంగ్రెస్‌ విధానం అన్నారు. చార్మినార్‌ వద్ద గతంలో రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర చేశారు. అదే చార్మినార్‌ వద్ద రాహుల్‌ గాంధీ కూడా సద్భావన యాత్ర చేశారు. నాలుగు ఎమ్మెల్సీల్లో ఒకటి మైనారిటీలకు ఇచ్చామన్నారు. ఈ ప్రభుత్వంలో అనేక పదవులు అప్పగించామన్నారు. మైనారిటీలకు మా పార్టీ 4 శాతం రిజర్వేషన్లు కల్పించింది. వాళ్ల రిజర్వేషన్లను రద్దు చేయడానికి మోడీ యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిని ఓడించాలని సీఎం అన్నారు.

First Published:  11 Nov 2024 2:43 PM IST
Next Story