చేయని పనులు చేసినట్లు
శాసన సభలో ప్రభుత్వం గవర్నర్ నోటి నుంచి పూర్తిగా అబద్ధాలు చెప్పించిందన్న బీజేపీ ఎల్పీ

గవర్నర్ ప్రసంగంపై బీజేపీ ఎల్పీ విమర్శలు గుప్పించింది. ఆ పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. తెలంగాణ శాసన సభలో ప్రభుత్వం గవర్నర్ నోటి నుంచి పూర్తిగా అబద్ధాలు చెప్పించింది. ఇప్పటికే రైతులకు రూ 2 లక్షల రుణమాఫీ కాక ఆ ఉన్నటువంటి భారాన్ని వడ్డీలు కట్టలేనటువంటి లక్షలాది మంది రైతులు ప్రభుత్వానికి ఉత్తరాలు రాస్తున్నారు. కానీ రైతు రుణమాఫీ చేశామని చెప్పడం అబద్ధమన్నారు. లక్షమంది మహిళలను కోటీశ్వరులను చేశామని చెప్పించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. తెలంగాణలోని ఏ గ్రామాన్ని అయినా ఎంచుకోండి. అక్కడి మహిళలను అడుగుదాం. ఏ మహిళకైనా కోటి రూపాయల సాయం ప్రభుత్వం ద్వారా వచ్చిందో ఈ ప్రభుత్వం నిరూపించాలని సవాల్ విసిరారు. రైతులు, మహిళలలకు మేలు చేసినట్లు చెప్పించారని ధ్వజమెత్తారు. చేయనటువంటివి చేసినట్లు చూపించి గొప్పగా చేశామనే ప్రయత్నం చేశారని ఎద్దేవా చేశారు. గత బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులను ఖర్చు చేయలేదని విమర్శించారు. ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్య నారాయణ మాట్లాడుతూ రైతు భరోసా ఎంందరికి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.