Telugu Global
NEWS

అభిమాని చేసిన పనికి రేణు దేశాయ్ ఎమోషనల్

ఓ పవన్ కళ్యాణ్ అభిమాని హద్దు మీరి పెట్టిన మెసేజ్ కు రేణు దేశాయ్ గట్టిగా రిప్ల‌య్ ఇచ్చింది. 11 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను ఒక చెడ్డదానిలా, విలన్ లా చూస్తున్నారని.. ఇదంతా చూసి తాను విసిగిపోయానంటూ.. ఎమోషనల్ అయ్యింది.

అభిమాని చేసిన పనికి రేణు దేశాయ్ ఎమోషనల్
X

నటి, దర్శకురాలు రేణు దేశాయ్‌ని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాతో హీరోయిన్ గా రేణు దేశాయ్ కెరీర్ మొదలైంది. ఆ తర్వాత ఆమె మరోసారి పవన్ కళ్యాణ్ కు జోడీగా జానీ సినిమాలో నటించింది. ఈ సినిమా తర్వాతే పవన్, రేణు పెళ్లి చేసుకున్నారు. వీరికి అకీరా నందన్, ఆద్య పిల్లలు ఉన్నారు.

కాగా, 2012లో పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడాకులు తీసుకుని విడిపోయారు. అప్పటినుంచి రేణు దేశాయ్ సింగిల్ గానే ఉంటోంది. కొంతకాలం పిల్లలతో కలిసి రేణు పూణేలో ఉన్నది. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటోంది. అకీరా నందన్ ప్రస్తుతం చదువుకోవడంతోపాటు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాడు.

ఇదిలా ఉండగా.. అకీరాకు పబ్లిక్ లో కనిపించడం మొదటనుంచి అలవాటు లేదు. లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ కూడా అకీరా ఫొటోలను పోస్ట్ చేయదు. నిన్న అకీరా బర్త్ డే. ఈ సందర్భంగా మెగా హీరోలతో పాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అకీరాకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా ఓ పవన్ కళ్యాణ్ అభిమాని హద్దు మీరి పెట్టిన మెసేజ్ కు రేణు దేశాయ్ గట్టిగా రిప్ల‌య్ ఇచ్చింది. 11 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను ఒక చెడ్డదానిలా, విలన్ లా చూస్తున్నారని.. ఇదంతా చూసి తాను విసిగిపోయానంటూ.. ఎమోషనల్ అయ్యింది.

అకీరా బర్త్ డే సందర్భంగా ఓ పవన్ కళ్యాణ్ అభిమాని ..'మేడం ఇది చాలా అన్యాయం. మా అకీరాను ఒక్కసారి అయినా చూపించండి. మా అన్న (పవన్ కళ్యాణ్) కొడుకును చూడాలని మాకు ఉంటుంది. మీరు హైడ్ చేయకండి. అప్పుడప్పుడు వీడియోలలో అయినా అకీరాను చూపించండి' అని రేణుకు మెసేజ్ చేశాడు. దీనిపై రేణుక దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు అభిమానికి ఘాటుగా రిప్ల‌య్‌ ఇచ్చింది.

' మీ అన్న కొడుకా?? అకీరా నా కొడుకు. మీరు ఒక తల్లికి పుట్టలేదా. మీరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అని నేను అర్థం చేసుకోగలను. కానీ, కొంచెం మాట్లాడే పద్ధతి నేర్చుకోండి. చాలావరకు ఇటువంటి కామెంట్లను డిలీట్ చేస్తూ వస్తున్నాను. అయినా కొందరు హద్దు దాటి చాలా కఠినంగా మాట్లాడుతున్నారు. నా కొడుకు పుట్టిన రోజున ఇలాంటి కామెంట్లు చదవడం బాధేస్తోంది. 11ఏళ్లుగా నన్ను ఒక చెడ్డ దానిలా, విలన్ గా చూస్తున్నారు. ఇదంతా చూసి చూసి నేను విసిగిపోయాను.' అంటూ రేణు ఆవేదన వ్యక్తం చేసింది. పవన్ అభిమానికి రిప్ల‌య్‌ ఇస్తూ రేణు చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

First Published:  9 April 2023 12:00 PM IST
Next Story