లింగమార్పిడి చేయించుకొని.. వివాహం కోసం కోర్టుకు
వారి అభ్యర్థన కోర్టు ముందుకు వచ్చింది. దీనిపై విచారణ సందర్భంగా బరేలీ సబ్ డివిజన్ మేజిస్ట్రేట్ ప్రత్యూష్ పాండే స్పందిస్తూ.. ప్రత్యేక వివాహ చట్టం కింద వారు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.
వారిద్దరూ యువతులు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఓ ప్రయివేటు కంపెనీలో పనిచేస్తున్నారు. ఆ యువతుల్లో ఒకరిది బరేలీ కాగా, మరొకరిది బదాయూ. వారి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లితో ఒక్కటవ్వాలనుకున్నారు. కుటుంబసభ్యుల దృష్టికి తీసుకెళితే వారు ఇందుకు ససేమిరా అన్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేమని భావించిన ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు. వారిలో ఒక యువతి లింగమార్పిడి చేయించుకుంది. పూర్తి చికిత్స అనంతరం రిజిస్ట్రేషన్ వివాహానికి దరఖాస్తు చేసుకున్నారు.
తాజాగా వారి అభ్యర్థన కోర్టు ముందుకు వచ్చింది. దీనిపై విచారణ సందర్భంగా బరేలీ సబ్ డివిజన్ మేజిస్ట్రేట్ ప్రత్యూష్ పాండే స్పందిస్తూ.. ప్రత్యేక వివాహ చట్టం కింద వారు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ పెళ్లికి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. అయితే వీరి విషయంలో లింగమార్పిడి అనంతరం దరఖాస్తు వచ్చిందని వివరించారు. ఇలాంటి కేసు తమ ముందుకు రావడం ఇదే తొలిసారని చెప్పారు. ఈ వ్యవహారంలో చట్టం ప్రకారం ముందుకెళతామని న్యాయమూర్తి తెలిపారు.