Telugu Global
National

కాళ్లు మొక్కిన అభిమాని.. షాక్ అయిన కోహ్లీ

రెండేళ్లుగా ఫామ్ లేక సతమతం అవుతున్న కోహ్లీ గతేడాది సెప్టెంబర్ లో తిరిగి ఆ ఫామ్ అందిపుచ్చుకున్నాడని తేలిపోయింది. దుబాయ్ లో జరిగిన ఆసియా కప్ లో సెంచరీ కొట్టి అదరగొట్టాడు.

కాళ్లు మొక్కిన అభిమాని.. షాక్ అయిన కోహ్లీ
X

గ్రౌండ్ లో క్రికెటర్లను దగ్గరనుంచి చూసేందుకు, వారికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు పక్కకు వచ్చి సెల్ఫీ దిగేందుకు అభిమానులు ఇష్టపడతారు, సాహసాలు కూడా చేస్తుంటారు. కానీ తిరువనంతపురంలో జరిగిన మ్యాచ్ లో ఓ అభిమాని సడన్ గా గ్రౌండ్ లోకి దూసుకొచ్చాడు. ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ దగ్గరకు పరిగెత్తుకెళ్లాడు. అతను రావడం చూసి కోహ్లీ షాకయ్యాడు. కాస్త దూరంగా వెళ్లబోయాడు, కానీ అభిమాని నేరుగా కోహ్లీ దగ్గరకు వచ్చి అతని కాళ్లు పట్టుకున్నాడు. నువ్వు దేవుడయ్యా అంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు.

కోహ్లీకి వీరాభిమానులు చాలామందే ఉన్నారు. ఆమధ్య అతని ఫామ్ తగ్గిన తర్వాత అందరూ కాస్త చప్పబడ్డారు. కానీ కోహ్లీ కాస్త టైమ్ గ్యాప్ ఇచ్చారంతే, టైమింగ్ లో గ్యాప్ లేకుండా ఇప్పుడు మళ్లీ పరుగుల వరద పారిస్తున్నారు. పూర్తి స్థాయిలో మునుపటి ఫామ్ లోకి వచ్చాడు. ఆదివారం శ్రీలంకపై జరిగిన మూడో వన్డేలో కోహ్లీ 166 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. అంతే కాదు ఒకే జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా, ఇండియాలో అత్యధిక సెంచరీలు చేసిన టీమిండియా ప్లేయర్ గా కూడా కోహ్లీ మునుపటి రికార్డులను సవరించాడు. ఆదివారం జరిగిన మ్యాచ్ టీమిండిగా సమష్టి విజయమే అయినా, కోహ్లీ మాత్రం సమ్ థింగ్ స్పెషల్ అనిపించుకున్నారు. అందుకే ఆయన అభిమానుల సంతోషానికి అంతే లేకుండా పోయింది. గ్రౌండ్ లోకి వచ్చి కోహ్లీ కాళ్లపై పడిపోయాడు ఓ యువకుడు.

రెండేళ్లుగా ఫామ్ లేక సతమతం అవుతున్న కోహ్లీ గతేడాది సెప్టెంబర్ లో తిరిగి ఆ ఫామ్ అందిపుచ్చుకున్నాడని తేలిపోయింది. దుబాయ్ లో జరిగిన ఆసియా కప్ లో సెంచరీ కొట్టి అదరగొట్టాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకున్నాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన సిరీస్ లో రెండు సెంచరీలతో చెలరేగిపోయాడు కోహ్లీ. తిరువనంతపురంలో జరిగిన చివరి మ్యాచ్ లో టీమిండియా 390 స్కోర్ చేసి, 317 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడం రికార్డ్ అయితే, అందులో కోహ్లీ 166 పరుగులు అమూల్యం. 13 ఫోర్లు, 8 సిక్స్ లతో కళ్లు చెదిరే ఇన్నింగ్స్ ఆడాడు కోహ్లీ. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

First Published:  16 Jan 2023 7:43 AM IST
Next Story