రోడ్డు ప్రమాదంలో యువ ఐపీఎస్ మృతి
డ్యూటీలో చేరేందుకు వెళుతున్న ఓ యువ ఐపీఎస్ ఆఫీసర్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు
ఎన్నో కష్టాలు పడి చదివి ఐపీఎస్ అయి.. ఎస్పీగా జాయిన్ అవ్వడానికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఓ యువ ఐపీఎస్ ఆఫీసర్. మధ్యప్రదేశ్‌కు రాష్ట్రానికి చెందిన హర్ష్ బర్ధన్ అనే 27 ఏళ్ల యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ ఎంతో కష్టపడి చదివి ఐపీఎస్ అయి.. కర్ణాటకలోని హోలెనరసిపురలో ప్రొబేషనరీ ఎస్పీగా ఎంపికయ్యాడు. నిన్న పోస్టింగ్ కోసం హోలెనరసిపురకు వెళ్తుండగా, హసన్-మైసూరు రోడ్డుపై టైర్ పేలి కారు పక్కనే ఉన్న ఇంటిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హర్ష్ బర్ధన్, ఆయన కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు.
హర్షవర్ధన్ కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస వదిలాడు. కారు డ్రైవర్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య స్పందిస్తూ.. ఏళ్ల తరబడి శ్రమించి, తీరా ఆ శ్రమకు ఫలితం అందుకోవాల్సిన సమయంలో హర్షవర్ధన్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ట్వీట్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని పేర్కొంటూ హర్షవర్ధన్ కుటుంబానికి ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు.