అప్రూవర్‌గా మారిన వైసీపీ ఎంపీ
ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఆయన ఈడీకి కీలక విషయాలు వెల్లడించినట్టు చెబుతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సంబంధించిన అంశాలను ఆయన వెల్లడించారని ప్రచారం జరుగుతోంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి అప్రూవర్‌గా మారారు. ఇప్పటికే ఈ కేసులో మాగుంట శ్రీనివాస్ రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి, అరబిందో సంస్థ యజమాని శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారారు. మాగుంట శ్రీనివాస్ రెడ్డి ప్రమేయంపైన ఆరోపణలు రాగా ఆయన కూడా ఇప్పుడు అప్రూవర్‌గా మారారు. ఈ స్కాంకు సంబంధించి ఆయన ఈడీకి కీలక విషయాలు వెల్లడించినట్టు చెబుతున్నారు.
ముఖ్యంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సంబంధించిన అంశాలను ఆయన వెల్లడించారని ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలోకి అడుగుపెట్టడానికి ముందు తాను కేజ్రీవాల్‌ను కలిశానని... ఆయన సలహా మేరకే అక్కడ వ్యాపారంలోకి దిగినట్టు మాగుంట వెల్లడించారు. కొందరు నేతలకు ముడుపుల అందజేతకు సంబంధించిన వివరాలనూ మాగుంట ఇచ్చినట్టు చెబుతున్నారు.
ముడుపులు అందజేసిన సౌత్ గ్రూప్‌లో మాగుంట శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి కీలక పాత్ర పోషించారన్నది ప్రధాన అభియోగం. వారు ముగ్గురు ఇప్పుడు అప్రూవర్‌గా మారారు. జీ-20 సమావేశాలు ముగిసిన తర్వాత ఈ కేసులో కీలక పరిణామాలుంటాయని సమాచారం.
∗