Telugu Global
National

హనుమంతుడి విగ్రహం ముందు మహిళల బాడీ బిల్డింగ్.. నెటిజన్ల ఫైర్

అదికూడా మహిళలు బికినీలు ధరించి ఆంజనేయ స్వామి విగ్రహం ఎదుట బాడీ బిల్డింగ్ చేయడం వివాదాస్పదంగా మారింది. ఇటీవల మధ్యప్రదేశ్‌లో నేషనల్ బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించారు.

హనుమంతుడి విగ్రహం ముందు మహిళల బాడీ బిల్డింగ్.. నెటిజన్ల ఫైర్
X

పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామికి కొండలను సైతం ఎత్తుకు వెళ్లేంత బలం ఉందని చెబుతుంటారు. ఆంజనేయ స్వామి చిత్రపటాలు, విగ్రహాలు చూస్తే కండలు తిరిగిన దేహాన్ని గమనించవచ్చు. అందుకే వ్యాయామశాలల్లో శక్తికి ప్రతిరూపం అయిన ఆంజనేయ స్వామి చిత్రపటాలను ఉంచుతుంటారు. కొంతమంది ఆంజనేయ స్వామి విగ్రహాలు పెట్టి బాడీ బిల్డింగ్ కూడా నేర్పుతుంటారు. కాగా.. బాడీ బిల్డింగ్ సమయంలో పురుషులు కేవలం ఇన్నర్ వేర్ ధరించి కండలను ప్రదర్శిస్తుంటారు. అయితే ఈ విధంగా మహిళలు బాడీ బిల్డింగ్ చేయడం ఎక్కడా కనిపించదు. అయితే ప్రస్తుతం మహిళలతో కూడా బాడీ బిల్డింగ్ చేయించడం వివాదాస్పదంగా మారుతోంది.

అదికూడా మహిళలు బికినీలు ధరించి ఆంజనేయ స్వామి విగ్రహం ఎదుట బాడీ బిల్డింగ్ చేయడం వివాదాస్పదంగా మారింది. ఇటీవల మధ్యప్రదేశ్‌లో నేషనల్ బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలతో కూడా బాడీ బిల్డింగ్ చేయించారు. కొందరు మహిళలు బికినీలు ధరించి ఆంజనేయ స్వామి విగ్రహం ఎదుట బాడీ బిల్డింగ్ చేశారు. ఇది ప్రస్తుతం తీవ్ర వివాదంగా మారింది.


ఆంజనేయస్వామి బ్రహ్మచారి అని.. అలాంటిది ఆయన విగ్రహం ఎదుట ఆడవాళ్లు బికినీలతో దేహాన్ని ప్రదర్శించడం ఎంతవరకు సబబు అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దైవం పట్ల భారతీయులు ఎంతో భక్తిశ్ర‌ద్ధ‌లు కలిగి ఉంటారు. ఆంజనేయ స్వామి అంటేనే ఆడవాళ్లకు దూరమని, ఆయన బ్రహ్మచారి అని ప్రచారంలో ఉంది. అలాంటి దేవుడి విగ్రహాన్ని పక్కన పెట్టుకొని మహిళలతో బాడీ బిల్డింగ్ చేయించడంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వస్తున్నాయి.

మధ్యప్రదేశ్ లో నిర్వహించిన మహిళల‌ బాడీ బిల్డింగ్ కు సంబంధించిన వీడియోలు, ఫొటోలను సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ట్విట్టర్ లో షేర్ చేయడంతో ఈ ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో ఈ కార్యక్రమం చేపట్టిన నిర్వాహకులపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  7 March 2023 6:36 PM IST
Next Story