Telugu Global
National

యడ్యూరప్పపై లైంగిక దాడి కేసు పెట్టిన మహిళ మృతి

యడ్యూరప్పపై లైంగిక దాడి కేసు పెట్టిన మహిళ కొంతకాలంగా శ్వాస సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతోంది. ఈ క్రమంలో ఆమె ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ చనిపోయినట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు.

యడ్యూరప్పపై లైంగిక దాడి కేసు పెట్టిన మహిళ మృతి
X

బీజేపీ సీనియర్ నాయకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పపై లైంగిక దాడి కేసుపెట్టిన మహిళ మృతి చెందింది. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆమె ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 2న బెంగళూరులోని యడ్యూరప్ప నివాసానికి తన కూతురితో కలిసి వెళ్లగా.. యడ్యూరప్ప తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఓ మహిళ ఆరోపించింది.

దీనిపై ఆమె మార్చి 14న బెంగుళూరులోని సదాశివ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులు యడ్యూరప్పపై పోక్సో చట్టంలోని సెక్షన్ 8తోపాటు ఐపీసీ 354ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ లైంగిక దాడి కేసును కర్ణాటక సీఐడీ దర్యాప్తు చేస్తోంది.

ఇదిలా ఉంటే యడ్యూరప్పపై లైంగిక దాడి కేసు పెట్టిన మహిళ కొంతకాలంగా శ్వాస సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతోంది. ఈ క్రమంలో ఆమె ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ చనిపోయినట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. యడ్యూరప్పపై లైంగిక దాడి కేసు పెట్టిన మహిళ మృతి చెందినప్పటికీ ఆమె ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా తదుపరి విచారణ కొనసాగిస్తామని సీఐడీ అధికారులు తెలిపారు.

First Published:  28 May 2024 4:55 AM GMT
Next Story